వడ్డించే వాడు మనవాడైతే.. ఏ మూలన కూర్చున్నా ఫర్వాలేదని పెద్దలు చెప్పిన సామెత అక్షరాల నిజమని కేంద్ర ప్రభుత్వ అధికారుల వైఖరి స్పష్టం చేస్తుంది. బావ ప్రకటన వెల్లడిస్తే.. పోలీసు పిర్యాదులు.. జైలు గోడలను సునాయాసంగా పరిచయం చేసే అధికారులు.. ప్రముఖ వ్యక్తుల ఫోటోలను వారి అనుమతి లేకుండా వినియోగించుకున్నందుకు పడే జరిమానా చూస్తే మాత్రం కళ్ల బైర్లుగమ్మే షాక్ తగులుతుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లిఖిత సమాధానంలో తెలిపారు.
ఇదే జరిమానా ఇప్పుడు రిలయన్స్ జియో, పేటీయం సంస్థలు కూడా ఎదుర్కోనుంది. అనుమతి లేకుండా ప్రధాని ఫొటోను జియో ప్రకటనలలో వాడుకున్నందుకు గాను ఈ జరిమానాను విధిస్తామని చెప్పారు. రిలయన్స్ జియో, పేటీయం సంస్థలు ప్రధాని ఫోటోను ప్రకటనల్లో వాడుకుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంపై లో తెలిపడంతో దీన్ని ఎలా అనుమతించారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా చూసే చట్టం ఏమైనా ఉందా అని నీరజ్ శేఖర్ ప్రశ్నించారు.
అయితే కేవలం 500 రూపాయలు ఫైన్ మాత్రమే విధించనున్నారన్న సమాచారం తో భవిష్యత్ లో ప్రధాని సహా కేంద్ర మంత్రుల ఫోటోలను అనుమతి లేకుండా వినియోగించుకునే వారి సంఖ్య అధికమౌతుందని ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. అయితే ఈ ప్రకటనలపై ఏకంగా పార్లమెంటులోనే సభ్యులు నిలదీస్తున్న క్రమంలో ఎలాంటి పిర్యాదు అందలేదని, అందుచేత ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని కూడా కేంద్రమంత్రి రాధోడ్ చెప్పడం పలు విమర్శలకు దారి తీస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more