ఆ యువ ఇంజనీరు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని మొప్పించగలిగాడు. కానీ పోలీసులను మాత్రం మెప్పించలేకపోయాడు. అదేంటి ప్రధానితో ప్రశంసలందుకున్నవాడు.. పోలీసులను ఎలా మెప్పించలేకపోయాడు..? అంటూ విస్మయానికి గురికాకండి. ప్రధాని మోడీని గత ఏడాది జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో తన అవిష్కరణతో మెప్పించాడు. అందులు వాడే చేతి కర్రలో సెన్సార్లతో వారి మార్గంలో ముందు వచ్చే గోతులు రాళ్లు ఏవైనా వస్తే.. అ సెన్సార్ల ప్రభావంతో అవి అలారమ్ మోగ్రిస్తాయి. దీంతో వెంటనే వారు అలర్గ్ అవుతారు. ఇలాంటి అవిష్కరణతో ఆ యువ ఇంజనీరు ప్రధానిని మొప్పించి.. ప్రశంసలను అందుకున్నారు.
కట్ చేస్తే.. ఏడాది క్రితమే ఇలాంటి అవిష్కరణతో అకట్టుకున్న యువ ఇంజనీరు.. ఇప్పడు సొంతంగా వ్యాపారం పెట్టుకునే స్థాయికి ఎదుగుతారని ఎవరైనా అశించవచ్చు. అలానే ఈయన కూడా ఖరీదైన అడి కారును కొన్నారు. అయితే ఏ హోదా లేకుండానే తన కారుపై ఎర్ర బుగ్గను పెట్టుకున్నారు. ఒక ఇంజనీరు విద్యను అభ్యసించిన వ్యక్తికి ఎర్రబుగ్గ దేనికి సంకేతం.. ఎవరెవరు దానిని తమ కార్లపైన పెట్టుకోవాలి అన్న విషయం కూడా తెలియదా..? అంటే తప్పకుండా తెలుస్తుంది. కానీ అవన్నీంటినీ పక్కనబెట్టి.. తన కారుకు కూడా ఎర్రబుగ్గను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అ యువ ఇంజనీరుతో పాటు అతడి గ్యాంగ్ కు చెందిన మరో ఇద్దరు సభ్యులను కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.
అదేంటీ ఎర్రబుగ్గ పెట్టుకోవడం అంత నేరమా అని అలోచిస్తున్నారా..? ఎర్రబుగ్గ మాటున యువ ఇంజనీరు చేస్తున్న దందా తెలిస్తే.. అవ్వాక్కవుతారు. కొత్తగా ప్రభుత్వం ముద్రించిన రూ.2000 నోట్లను నకిలీవి ముద్రిస్తూన్నాడు. వాటిని నల్లధన కుబేరులతో డీల్ కుదుర్చుకుని మారుస్తున్నాడు. ఇదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల్ ఉదర్ అన్న తరహాలో 30 నుంచి 40 శాతం మేరకు కమీషన్ తీసుకుని డబ్బును మార్పిడి చేస్తున్నాడు. అయితే మార్పిడి కింద ఇతగాడు ఇచ్చేవన్నీ దొంగనోట్లే. ఈ విషయం తెలియక ఇతని బట్టులోపడిన వారందరూ ఇప్పుడు తేలుకుట్టిన దోంగలుగా మారిపోయారు. ఇంతకీ ఈ యువ ఇంజనీర్ ఎవరంటారా..?
ఆ యువ ఇంజనీర్ పేరు అభివన్ వర్మ. పోలీసులు అతడిని పంజాబ్లోని మొహాలీలో అరెస్టుచేశారు. అతడి వద్ద రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ వర్మ అనే ఈ యువ ఇంజనీరుతో పాటు, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్పాల్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కినెట్టారు. వీళ్ల సరికొత్త ఆడి ఎస్యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేయగా, అందులోంచి 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయన్నారు. ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నారని, కానీ ఆ ఇద్దరూ పారిపోయారని పోలీసులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more