వంగవీటి తగ్గే ప్రసక్తే లేదు... బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ.... | RGV not compromise on Vangaveeti release.

Rgv no compromise on vangaveeti

Ram Gopal Varma, Ram Gopal Varma meet Vangaveeti, Vangaveeti and Devineni Family, Vangaveeti controversy, RGV Vangaveeti Issue, RGV not compromised on Vangaveeti, Vangaveeti Movie, RGV no compromise on Vangaveeti, Devineni Nehru Vangaveeti, Devineni Nehru Cigar, Vangaveeti News

Ram Gopal Varma meet Vangaveeti and Devineni Family says not compromised on Vangaveeti Family.

వంగవీటి నా డ్రీమ్ ప్రాజెక్టు.. తగ్గే ప్రసక్తే లేదు: వర్మ

Posted: 12/03/2016 04:32 PM IST
Rgv no compromise on vangaveeti

వంగవీటి ప్యామిలీతో చర్చలు విఫలం కావటంతో అనంతరం దేవినేని నెహ్రూతో భేటీ అయిన వ‌ర్మ సినిమా విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు. సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు తర్వాత చెబుతానన్న ఆర్జీవీ, తాను సినిమా ట్రైల‌ర్ ను మాత్ర‌మే దేవినేని నెహ్రూకి చూపించాన‌ని, ప్రత్యేకంగా ఇత‌రుల పాత్రల వివరాలను నెహ్రూకి చెప్పలేద‌ని తెలిపారు. ప్రస్తుతం వివాదాలు కమ్ముకున్నప్పటికీ, తాను తీసిన సినిమాలో మార్పులు మాత్రం ఏమీ చేయ‌బోన‌ని వర్మ తెగేసి చెప్పారు.

సినిమా తీసుకునే హ‌క్కు త‌న‌కు ఉందని, ఆ ప్ర‌కార‌మే ముందుకు వెళ‌తానని అన్నారు. వంగ‌వీటి రాధాకృష్ణ, ర‌త్నకుమారిల నుంచి ఎటువంటి అబ్జెక్ష‌న్ వచ్చిందన్న దాని గురించి త‌రువాత చెబుతాన‌ని తెలిపారు. వారితో చ‌ర్చించిన అంశాల్లో కొన్ని స‌మ‌స్య‌లొచ్చాయని మాత్ర‌మే వర్మ చెప్పారు. అంద‌రూ ఒకేలా ఆలోచించరని, త‌మ త‌మ‌ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూనే ఉంటార‌ని అన్నారు. ఇద్ద‌రు మ‌నుషులకి మ‌ధ్య తలెత్తే విభేదాలు అప్పటి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటాయి. వాటిని ఇప్పుడు సినిమాలో చూపించినంత మాత్రాన ఆ విభేదాలు మళ్లీ బ‌య‌ట‌కి రావని అన్నారు.

వ్య‌క్తిగతంగా ఒక‌రిని టార్గెట్ చేస్తూ తాను సినిమా తీయ‌లేదని చెప్పారు. నెహ్రూకి ఆడియో టైల‌ర్స్ మ‌త్ర‌మే చూపించాన‌ని, రాధా, ర‌త్నకుమారిల గురించి ఇప్పుడు చెప్ప‌ద‌లుచుకోవ‌ట్లేదని అన్నారు. తాను ఎవ‌రి అభ్యంత‌రాల‌నూ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనని స్ప‌ష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో కూడా ట్వీట్లు చేశాడు. రాధారంగ మిత్ర మండలి నుంచి కూడా తనకు కొంత మద్ధతు లభిస్తోందని తెలిపిన వర్మ, వారిని కూడా వేడుకకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు.

 

తన్నుకు చచ్చేంత సీన్ లేదు- దేవినేని నెహ్రూ

ఇక వంగ‌వీటి సినిమా గురించి దేవినేని నెహ్రూ మాట్లాడారు. గతంలోనూ తమ ఇంటికి వ‌స్తాన‌ని వ‌ర్మ‌ అన్న‌ప్పుడు స్వాగ‌తించాన‌ని, ఇప్ప‌డు కూడా అదేప‌ని చేశాన‌ని అన్నారు. సినిమాలో ఓ పాట‌ను బ్యాన్ చేయ‌డం మంచిద‌ని గ‌తంలో రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌ను క‌లిసిన‌ప్పుడు చెప్పాన‌ని గుర్తు చేశాడు. డైరెక్ట‌ర్ల‌కి ఏ క‌థ‌నైనా సినిమాగా తీసుకునే స‌ర్వ‌హ‌క్కులు ఉన్నాయ‌ని ఆ రోజే చెప్పానని అన్నాడు. కేవలం ట్రైలర్ మాత్రమే తనకు చూపించాడని చెప్పిన నెహ్రూ, మిగ‌తా సినిమా గురించి త‌న‌కు అంత‌గా తెలియ‌ద‌ని చెబుతున్నాడు.

వ‌ర్మ‌కు కావాల్సింది సినిమా బిజినెసేన‌ని, ఆయ‌న వృత్తి అదేన‌ని వ్యాఖ్యానించారు. నిజ‌జీవితాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలు తీసుకుంటాడు, అయినా స‌మాజంలోని వ్య‌క్తులు ఎలాంటి వారో ప్ర‌జ‌ల‌కి తెలుసని, సినిమాల్లో ఎలా చూపించినా అంత‌ప్ర‌భావం ఉండ‌బోద‌ని అన్నారు. ఒక‌రికున్న మనస్తత్వం మ‌రొక‌రికి ఉండ‌దని అన్నారు. ఇక నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలను చూసి పాతక‌క్ష‌ల‌ను గుర్తుకు తెచ్చుకొని త‌న్నుకు చచ్చే ప‌రిస్థితులు ఇప్పుడు అస్సలు లేవని దేవినేని నెహ్రూ అన్నారు.

ఇప్పుడు అంద‌రూ బిజీబిజీగా బ‌తుకుతున్నార‌ని, అటువంటి ప్ర‌జ‌లు సినిమాల్లో చూపించే వాటిని ప‌ట్టించుకోరని దేవినేని నెహ్రూ అన్నారు. సినిమాలో తన పాత్ర గురించి వ‌ర్మ వీడియో క్లిప్ చూపిస్తూ ఓ మేకప్ వేసిన మ‌నిషిని చూపించాడని దేవినేని నెహ్రూ అన్నారు. ఆ వీడియో చూశాక‌ ఆ వ‌య‌సులో తాను అలాగే ఉన్నానులే అని అనుకున్నానని చెప్పారు. తాను ఎటువంటి వాడినో ప్ర‌జ‌ల‌కి తెలుసని, త‌న‌ను సిగ‌రేట్ తాగే వాడిలా చూపించారని, తన తాత‌ల కాలం నుంచి కూడ సిగ‌రేట్ తాగే అలవాటు త‌మకు లేదని, కనీసం టీ, కాఫీలు కూడా తాగమని, వక్కపొడి కూడా నోట్లో వేసుకోనని నెహ్రూ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Vangaveeti Movie  Vangaveeti family  Devineni Nehru  

Other Articles