అర్జున అవార్డు గ్రహీత అందుకున్న క్రీడాకారుడు.. దేశంలో ఒక క్రీడాకారుడు పోందే అత్యున్నత పురస్కారమది. అలాంటి పురస్కారాన్ని పోంది కూడా తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయాడు అ క్రీడాకారుడు. అంతటి ఉన్నత స్థానానికి వెళ్లిన క్రీడాకారుడు.. సభ్య సమాజం తలదించుకునేలా నయవంచనకు పాల్పడ్డాడు. జాతీయ స్థాయి మహిళా షూటర్ తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్లో పలు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న వ్యక్తి తనపై దారుణానికి ఒడిగట్టాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీలోని చాణక్యపురి పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షూటింగ్ రేంజ్లో బాధిత మహిళ శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో అక్కడే తనతో పాటు సాధన చేస్తున్న సీనియర్ షూటర్‌తో రెండేళ్ల కింద పరిచయం ఏర్పడింది. అతడు షూటింగ్లో ఆమెకు గైడ్‌లా వ్యవహరించేవాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మహిళా షూటర్‌ను పెళ్లి చేసుకుంటానని అతడు మాట ఇచ్చాడు. ఇటీవల ఆమె బర్త్ డేకు చాణక్యపురిలోని ఇంటికి వెళ్లిన అతడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో పాటు పెళ్లి ప్రస్తావనను దాటవేస్తున్నాడు.
ఇటీవల పెళ్లి గురించి గట్టిగా నిలదీయగా.. షూటింగ్ రైఫిల్‌తో కాల్చేసి ప్రమాదం అని చెబుతా జాగ్రత్త అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన పిర్యాదులో పేర్కోంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మెడికల్ ఎగ్జామ్‌లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. అత్యాచారానికి పాల్పడిన షూటర్‌పై పోలీసలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శనివారం నిందితుడిని కలిసిన పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more