వాతావరణ అధ్యయన ఉపగ్రహం.. విజయవంతం Isro's PSLV-C36 Resource SAT-2A launched successfully

Isro s pslv c36 resource sat 2a launched successfully

Isro, Indian Space Research Organisation, PSLV-C36, RESOURCESAT-2A, Earth Observation Satellite, LISS-3 camera, PSLV, space, AWIFS, ISRO, LISS-3, LISS-4, PSLV, PSLV-C36, ResourceSat-2A, SWIR, Technology

The Indian Space Research Organisation (ISRO) launched its PSLV C36 Resource Sat-2A at 10.25 am Wednesday from the Satish Dhawan Space Centre in Sriharikota.

ITEMVIDEOS:వాతావరణ అధ్యయన ఉపగ్రహం రిసోర్స్‌శాట్-2ఎ.. విజయవంతం

Posted: 12/07/2016 11:15 AM IST
Isro s pslv c36 resource sat 2a launched successfully

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. రైతులకు మేలు చేకూర్చే విధంగా వాతావరణాన్ని అధ్యయనం చేసే పీఎస్‌ఎల్వీ సీ 36 రాకెట్ ప్రయోగాన్ని ఇవాళ ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఇవాళ ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టగా, నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల్లో పూర్తైన ఈ ప్రయోగంతో.. నింగిలోకి 1235 కేజీల బరువైన రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఈ ఉపగ్రహాం రానున్న ఐదేళ్ల పాటు దేశానికి సేవలందించనుంది. బహుళ ప్రయోజనాల రాకెట్‌గా పేరుగాంచిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్‌ఎల్వీ ద్వారా 38వరుస విజయాలు అందుకున్న ఇస్రో మరో మైలు రాయిని అధిగమించింది. పీఎస్‌ఎల్వీ సీ-36 రాకెట్ ద్వారా వెళ్లే రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహం రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ మేరకు దిగుబడి వస్తుంది, వ్యవసాయానికి అనుకూల ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది.


 
44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్వీ సీ-36 ద్వారా 1235 కేజీల బరువైన రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా చేర్చారు. రిసోర్స్‌శాట్-2 కాలపరిమితి ముగియడంతో దాని స్థానంలో ఇస్రో 2ఎ ఉపగ్రహాన్ని చేర్చింది. ఈ ఉపగ్రహంలో ఇస్రో శాస్త్రవేత్తలు మూడు పెలోడ్లను పొందుపర్చారు. 5.8మీటర్ల స్పేషియల్ రెజల్యుషన్ ఉన్న సెల్ఫ్ స్కానర్, మూడు స్పక్ట్రల్ బ్యాండ్లలో ఆపరేటింగ్ కెమెరాను అమర్చారు. 5రోజులు పాటు సందర్శించేలా వీటిని డిజైన్ చేశారు. ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన చివరి ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isro  PSLV-C36  RESOURCESAT-2A  Earth Observation Satellite  LISS-3 camera  PSLV  space  Technology  

Other Articles