వైద్యో నారాయణో హరి అంటూ వైద్యులను దేవుళ్లతో సరిసమానంగా కొలిచే సంస్కృతి మనది. కానీ అదే వైద్యుడు తాను దైవాన్ని కాదు దెయ్యాన్ని అంటూ తెగబడితే.. తన కింద పనిచేసే ఓ కాంట్రాక్టు కార్మికురాలి పట్ల కీచక పర్వానికి తెరతీస్తే.. దారుణానికి ఒడిగడితే.. బాధితులను ఎవరు చెప్పుకుంటారు..? ఏమని చెప్పుకుంటారు. పవిత్రమైన వైద్యవృత్తిలో కొనసాగుతూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా సామూహిక అత్యాచారానికి ఓ వైద్యడు తెగబటం.. అతనికి ఇద్దరు అనుచరులు కూడా సహకరించి.. బాధితురాలిపై అదే తరహాలో దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు కలకలం రేపుతుంది.
దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా వుండాల్సిన దేశ రాజధానిలో ఈ దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఎన్‌డీఎంసీ ఆస్పత్రిలో పనిచేసే ఒక వైద్యుడు, మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కలిసి ఆస్పత్రి ప్రాంగణంలోనే ఓ కాంట్రాక్టు కార్మికురాలిపై అత్యాచారం చేశారు. డాక్టరుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరూ కలిసి తనను ఒక ల్యాబ్‌లో బంధించి, ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారని బాధితురాలు (29) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, అఫ్జల్ అలీఖాన్ అనే వైద్యుడికి అస్పత్రిలోని ఇద్దరు లాబ్ టెక్నీషన్లు పరిచయం చేశారని.. అదే ఒక రోజు ఇదే పనిలో భాగంగా తనను తన క్యాబిన్ కు పిలుపించుకున్న వైద్యుడు అతని క్యాబిన్‌లోనే వైద్యుడు తనపై అత్యాచారం చేశార తెలిపింది. ఆ తరువాత అక్టోబర్ నెలాఖరులో తాను పని ముగించుకుని వెళ్లడానికి సిద్ధం అవుతుండగా, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు తనను ఆపి, పైకి తీసుకెళ్లి, ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదని, ప్రాణాలను తీసేందుకైనా తాము వెనక్కిపోమని హెచ్చరించడంతో అందోళనకు గురైన మహిళ విషయాన్ని బయటకు చెప్పలేకపోయిందని పోలీసులు తెలిపారు. తర్వాత నవంబర్ మొదటివారంలో తనకు పరిచయమైన ఒక తోటమాలి కూడా తనపై అత్యాచారం జరిపాడని కూడా బాధితురాలు తన పిర్యాదులో పేర్కోంది. ఇదే క్రమంలో తనపై అత్యాచారాలు పెరుగుతుండటంతో ఉండబట్టలేక పోలీసులకు పిర్యాదు చేశానని తెలిపింది.
బాధితురాలి పిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులలో వైద్యుడితో పాటు ఒక టెక్నీషియన్‌ను అరెస్టు చేశామని అరెస్టు చేశారు. ఖాన్ కాంట్రాక్టును రద్దుచేశామని, టెక్నీషియన్లు ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఆస్పత్రిలో విచారణ జరుపుతామని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకంఉటామని ఆస్పత్రి డైరెక్టర్ రణ్‌వీర్ సింగ్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more