అది అతని ప్రియురాలి నివాసం.. ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుగా వుంది. అంతలో ప్రియురాలి నుంచి ప్రియుడికి ఫోన్.. నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయ్ అని ఫోన్ సారాంశం. కంగారు పడకు.. అని అవతలి వైపు నుంచి ప్రియుడి ధైర్యం. పెళ్లికి వచ్చిన వాళ్లకు నచ్చేస్తాననేమో అంటూ ప్రియురాలు అందోళన.. అదేం కాదు.. నేను వస్తున్నా.. ఇదంతా చూస్తుంటే.. మీకు ‘‘సినిమా చూపిస్త మామా’’ సినిమాలోని ఓ సన్నివేశం గుర్తుకు వస్తుంది కదూ.. అయితే ఇది రియల్ లైఫ్ లో జరిగిన సన్నివేశం.
కట్ చేస్తే.. సినిమాలో ప్రియుడు.. ప్రియురాలి ఇంటికెళ్లి అమె మాట్లాడుతున్న ఫఓన్ సంబాషణను స్పీకర్ ద్వారా పెళ్లిచూపులకు వచ్చిన వారికి వినిపిస్తాడు. కానీ ఇక్కడ నిజజీవితంలో ప్రియుడు కొంత మాస్ క్యారెక్టర్. తను ప్రేమించిన ప్రియురాలి తల్లిదండ్రులకు చెబితే వారు అంగీకరిస్తారని, షరతులకు వగైరాలకు వెళ్లకుండా ఏకంగా అందరి ముందు తన ప్రియురాలితో చేయకూడని పనిచేసి అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేశాడు. తన ప్రియురాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చాలా సాహసమే చేశాడు. ఈ తతంగాన్ని చూసి బిత్తెరపోయిన మగ పెళ్లి వారు అక్కడి నుంచి చిత్తగించారు.
ఇంతకూ ప్రియుడు ఏం చేశాడు.. అంటే తన ప్రేయసిని అందరి ఎదుటూ ముద్దపెట్టాడు. అంతే అప్పటి వరకు సాధారణంగా చూస్తున్న వారి కళ్లూ.. ఏకంగా పెద్దవి చేసే మరీ చూశారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని బక్కన్న పాలెం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని పెద్ద కుమార్తెకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. దీంతో కంగారు పడిన అ యువతి స్థానికంగా వుంటున్న ఓ బడా వ్యాపారికి తనయుడైన తన ప్రియుడికి సమాచారం అందించింది. ఏం ఫర్వాలేదు నేను వస్తున్నాని అభయమిచ్చాడు యువకుడు.
వెంటనే ప్రియుడు పెళ్లిచూపులు జరుగుతున్న సమయంలో ప్రియురాలి ఇంటికి వచ్చి అందరి ముందు అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ఇదంతా చూసి పెళ్లిచూపులకు వచ్చిన మగపెళ్లివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ముద్దు పెట్టుకున్న యువకుడు.. తన తల్లిదండ్రులను ఒప్పించి అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. యువకుడి తల్లిదండ్రులను వివాహానికి ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more