కామన్ ట్వీపుల్స్ లీడర్ మేధావుల జాబితాలో.. | Sushma Swaraj in Global thinkers list.

Sushma swaraj the common tweeple leader

The Foreign Policy magazine, Sushma Swaraj, Vineet Nayar couple, HCL Vineet Nayar, Sushma Swaraj in Global thinkers, the common tweeple leader, Sushma Swaraj dis charge, Chinamma Sushma Swaraj

Sushma Swaraj, Vineet Nayar couple in The Foreign Policy magazine's Global Thinkers 2016 list.

‘చిన్నమ్మ’ సుష్మా అరుదైన ఘనత

Posted: 12/14/2016 08:23 AM IST
Sushma swaraj the common tweeple leader

బీజేపీ నేత, భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు. 2016 ఏడాదికి గాను ప్రకటించిన ప్రపంచ మేధావుల జాబితాలో సుష్మ చోటు సంపాదించారు. ప్రతీ యేటా వంద మంది పేర్లతో ఈ జాబితాను విడుదల చేస్తుంది ‘ది ఫారిన్ పాలసీ’ మాగ్జైన్. ‘విధాన రూపకర్తల’ విభాగంలో మేధావుల జాబితాకు ఎంపికైన సుష్మ ‘కామన్ ట్వీపుల్స్(ట్విట్టర్) నాయకురాలని పత్రిక పేర్కొంది. సుష్మాతోపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్-అనుపమ దంపతులకు కూడా ఈ జాబితాలో పేరు దక్కింది.

ఇక ప్రపంచ మేధావుల జాబితాలో సుష్మ పేరు కూడా ఉండడం గర్వకారణమని బీజేపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కోలుకుంటున్నారు. రెండు రోజుల క్రితం (శనివారం) ఆరుగంటలపాటు డాక్టర్ ముకుత్ మింజ్, డాక్టర్ బన్సాల్ ఆధ్వర్యంలో 50 మంది వైద్యులు, సిబ్బంది విజయవంతంగా ఆమెకు కిడ్నీ శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కోలుకుంటుండడంతో ఆమెను ఐసీయూ నుంచి ప్రత్యేకవార్డుకు తరలించారు. ఆమెను వారం లేదా పదిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా తెలిపారు. కిడ్నీ దాత అయిన మహిళను కూడా త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, జెర్మన్ చాన్సలర్ అంజెలా మెర్కెల్, అమెరికా అటార్నీ జనరల్ లోరెట్టా లించ్ తదితరులు ఈ పత్రిక రూపొందించిన నిర్ణయాత్మక శక్తుల కేటగిరీలో స్థానం సంపాదించారు.

నాయర్ జంట గురించి...
సంపర్క్ అనే ఓ ఫౌండేషన్ ద్వారా నాయర్ జంట భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యావ్యవస్థను మార్చేందుకు పూనుకున్నారని పేర్కొంది. వాళ్లు సృష్టించిన స్మార్ట్ క్లాస్ కిట్‌ల ద్వారా ఒక్కో విద్యార్థికి కేవలం 70 రూపాయల వ్యయంలోనే ఈ కిట్‌ను అందజేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం 50వేల పాఠశాలల్లో ఆధునిక విద్యాబోధన జరగాలన్నది నాయర్ జంట లక్ష్యమని ఫారిన్ పాలసీ సంచిక తెలిపింది. చత్తీస్‌గఢ్, జమ్ముకాశ్మీర్‌లలో వారు తమ కృషి సాగిస్తున్నారని వివరించింది.

Vineet Nayar The Foreign Policy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : the common tweeple leader  Sushma Swaraj 2016  

Other Articles