అమ్మ ఆస్తులు హైదరాబాద్ లోనే చేతులు మారాయా? | Jayalalitha will to her relatives.

Jayalalitha will top secret

Jayalalitha Will, Amma Jayalalitha leave a will, Jayalalitha will Hyderabad, Jayalalitha Hyderabad properties, Successor for Jayalalitha assets, Jayalalitha assests, Heir for Jayalalitha, Jayalalitha legal heir

Amma Jayalalitha leave a will in Hyderabad.

జయ వీలునామా టాప్ సీక్రెట్

Posted: 12/14/2016 08:50 AM IST
Jayalalitha will top secret

జయ రాజకీయ వారసత్వం సంగతి ఏమోగానీ, ఆమె స్థిర చరాస్థులకు ఎవరికి చెందబోతున్నాయన్న దానిపై నెమ్మదిగా సస్పెన్స్ వీడిపోతుంది. ఆమె రాసిన వీలునామా అంటూ ఒకటి బయటికి రావటంతో కొత్త కథ మొదలైంది. ఆమె తన ఆస్తులను ఏం చేయదలుచుకున్నారు? తన వారసురాలిగా ఎవరిని నిర్ణయించారు? అన్నదానిపై 16 ఏళ్ల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చినట్లు, అది కూడా హైదారాబాద్ వేదికగా జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

2000 సంవత్సరంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. తనకు ఉన్న వెసులుబాటుతో ప్రైవేటు అటెండెన్స్ ద్వారా ఈ తంతు పూర్తి చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. అప్పట్లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. జూలై 14, 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్‌లో తన గార్డెన్స్ ఉన్న పేట్ బషీరాబాద్‌ అడ్రస్‌తో చేయించటం విశేషం.

‘పురుచ్చి తలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్, నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్’ల నిర్వాహకురాలిగా జయ తన పేరుతోపాటు శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను రిజిస్ట్రేషన్ సమయంలో చేర్చారు. 2001లో ట్రస్ట్ నిబంధనల్లో చిన్నచిన్న మార్పులు కూడా చేశారు. ట్రస్ట్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు ఐటీ శాఖ అనుమతి తీసుకుంటామని, లేకుంటే కార్యక్రమాలు నిర్వహించబోమని సవరణ పత్రాల్లో పేర్కొన్నారు.

ఆస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ, న్యాయస్థానాలకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించినట్టు సమాచారం. అయితే వీలునామా ఎవరి పేరుపై రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని వారసులకు (లీగల్ హెయిర్) తప్ప ఇతరులకు వెల్లడించడం వీలుకాదని చెబుతున్నారు. మరోపక్క అన్నాడీఎంకే వర్గాలు ఈ వీలు వార్తలను తోసిపుచ్చటం విశేషం.

 

మళ్లీ అంత్యక్రియలు...

హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయకుండా ఖననం చేసినందున జయలలిత ఆత్మకు మోక్షం లభించదని, అందుకే తాము మళ్లీ అంత్యక్రియలు చేశామని బంధువులు చెబతున్నారు. శ్రీరంగపట్నంలో కావేరీ నదీ ఒడ్డున పశ్చిమవాహినిలో ప్రధాన పూజారి రంగనాథ్ అయ్యంగార్ సమక్షంలో అచ్చం జయలలితలా ఉండే ఓ బొమ్మను తయారు చేయించి దహన సంస్కారాలు చేయించారు. 
 
అసలు ఆమెను ఖననం చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ ఎలా తీసుకుంటుందని, బంధువులను కూడా ఎందుకు దూరం పెట్టారని జయకు వరుసకు సోదరుడు అయిన వరదరాజు ప్రశ్నిస్తున్నాడు. తన సోదరి నాస్తికురాలు అయి ఉంటే ఆమె ఆలయాలకు వెళ్లేది కాదని, హిందూ ఉత్సవాల్లో పాల్గొనేది కాదని, అలాగే హిందూ సంప్రదాయాలను పాటించేది కాదు కదా అని ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former Tamil Nadu CM  Jayalalitha will  Hyderabad properties  Legal heir  

Other Articles