రేపు అర్థరాత్రి వరకే గడువు.. ధాటితే.. అంతేసంగతులు.. Old 500 Notes Won't Be Accepted Anywhere

Old 500 notes won t be accepted anywhere but banks from friday

Notes Ban, Demonetisation, Rs 500 and 1000 notes banned, Old 500 Rupee Notes, Arun Jaitley, PM Modi, Hospitals, Medical shops, toll gates, water bills, electricity bills

Old 500 rupee notes will not be accepted anywhere from Friday, the government has said. The notes can be deposited in banks till December 30.

ఆ పాత నోటుకు అప్పటివరకే గడువు.. దాటితే.. అంతేసంగతులు..

Posted: 12/14/2016 12:26 PM IST
Old 500 notes won t be accepted anywhere but banks from friday

పెద్దనోట్ల రద్దు నిర్ణయం కేంద్రం తీసుకున్న గోప్ప నిర్ణయమే అయినా.. ముందస్తు కసరత్తు చేయకుండా తీసుకున్న తొందరపాటు చర్య అని.. అందువల్లే ప్రజలు నోట్ల మార్పిడి విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి మరో ప్రకటన చేయడం కూడా దేశప్రజలను కలవరానికి గురిచేస్తుంది. నోట్ల రద్దు విషయంలో కేంద్రం పలు సందర్భాలలో వెలువరించిన ప్రకటనలు అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

తొలుత రూ. 500లను డిసెంబర్ 30 వరకు మార్చుకునే వీలు వుంటుందని స్వయంగా ప్రధాని వెలువరించిన ప్రకటనకే విలువలేకుండా పోతుంది. తాజాగా కేంద్ర అర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించిన సమాచారం మేరకు గురువారం అంటే రేపు అర్థరాత్రి వరకే రూ. 500 నోటు చెల్లుబాటు అవుతుంది. ఆ తరువాత దానిని అలాగే పెట్టుకుంటే.. దానిని ఈ నెల చివరిలోపు అంటే డిసెంబర్ 30లోపు బ్యాంకు అకౌంట్లలో జమచేయాల్సి వుంటుందని చెప్పారు.

గత కొన్ని రోజుల క్రితం పాత పెద్దనోట్లను నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, అస్పత్రులు, మెడికల్ దుకాణాలలో చెల్లుబాటు అవుతాయని, ఇక మార్పిడి అవకాశం కేవలం అర్భీఐ శాఖల్లోనే వుంటుందని ప్రకటించిన కేంద్రం.. తాజాగా చేసిన ప్రకటనతో ప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. పాత నోట్ల రద్దు తరువాత నవంబర్ 10న తెరుచుకున్న బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిల్చున్న ప్రజలకు బ్యాంకుల సేవలు అందుబాటులోకి రావడానికే కష్టంగా మారింది. ఇప్పటి వరకు తమ వద్దనున్న నోట్లను మార్చుకునేందుకే వీలుపడని సందర్భంలో.. ఇక అకౌంట్లలో డిపాజిట్ చేయడానికి అవకాశం వుండదని దీంతో తమ వద్దనున్న నోట్లు ఇక చెల్లవమోనని ప్రజలు అందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles