పెద్ద నోట్ల రద్దు వెనుక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద కుంభకోణానికి ప్రధాని తెరతీశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రమైన అరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి నేతలు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కించే పనిలోనే వున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీల నేతలు తమ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి 120 కోట్ల మంది బలం, బలగం వున్నాయని, అందుచేతే సుమారు ముఫ్పై ఏళ్లకు పైగా పార్లమెంటు కనీవినీ ఎరుగని సీట్లతో అయనను గెలిపించారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు.
పెద్దనోట్లు రద్దు చేసిన సుమారు నెల రోజుల తరువాత ఇవాళ అకస్మాత్తుగా రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి వ్యక్తిగత అవినీతి గురించి తనవద్ద పక్కా ఆధారాలున్నాయని చెబుతున్నారని, మరి గత 20 రోజులుగా అయన తన వద్దనున్నా అధారాలతో ఏం చేశారని ఎదురు ప్రశ్నించారు. ఇంతకాలం ఆ ఆధారాల గురించి ఎందుకు మాట్లాడలేదని, పార్లమెంటులో ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని కేంద్ర మంత్రులు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అనంతకుమార్ అన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి తాము చర్చకు సిద్ధమేనని చెబుతున్నామని.. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షం మాత్రం సభను నడవనివ్వడం లేదని ఆయన అన్నారు. నిజంగా రాహుల్ గాంధీ దగ్గర అంత భూమి బద్దలయ్యే సమాచారమే ఉంటే.. గడిచిన 20 రోజుల నుంచే ఆయన బయటపెట్టచ్చు కదా అని అనంతకుమార్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన అలా భూకంపం తెప్పించే విషయాలేవీ ప్రస్తావించలేదని.. బయటకు వచ్చి మాత్రం తనను మాట్లాడనివ్వడం లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే విపక్షాలకు చెందిన ఎంపీలు, నేతలు ఓ జాతీయ మీడియా స్టింగ్ అపరేషన్ లో చిక్కడంతో తమ అసహనాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో రాహుల్ ఇలా చెబుతున్నారని విమర్శించారు.
ప్రజలకు నీతి సూక్తులు చెబుతూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై విపక్షానికి చెందిన నేత రాహుల్ గాంధీ తీవ్రమైన అరోపణలు సంధించిన క్రమంలో బీజేపి నేతలు నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం కొంచెం తక్కువేనని చెప్పాలి. రాహుల్ గాంధీ తన వద్ద సాక్ష్యాధారాలు వున్నాయని, తేల్చిచెప్పిన క్రమంలో బీజేపి నేతలు ఎంతలా స్పందించాలని..? కానీ ఒకరిద్దరు మినహా అందరూ మౌనంగా వుండటానికి గల కారణాలు ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పరిశీలిస్తే అతని వద్ద ప్రధానికి సంబంధించిన ఏదో సమాచారం వుందనేలా కనిపిస్తున్నా..? అది నిజమా.? కాదా..? అని తేలావరకైనా తమ నేతకు అండగా వుండాల్సిన బీజేపి నేతలు ఎందుకలా దూరమవుతున్నారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దమ్ముంటే మీ వద్ద వున్న అధారాలను భయటపెట్టు.. మా నేతకు సంబంధించిన సమస్త సమాచారంపై బయట పెట్టు అని డిమాండ్లు రావాల్సిన సమయంలో ఢిఫెన్స్ లోకి బీజేపి నేతలు ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అవినీతి జరిగిందా.? అధారాలు వున్నాయా..? అన్న విషయాలను పక్కనబెడితే.. దాదాపు 10 ఏళ్ల తరువాత పార్టీని బ్రహ్మండమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తిపై వచ్చిన అరోపణలను ఖండించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more