అత్యంత విలువైన లోహలు బంగారం, వెండీలు వాటి కాంతులను కోల్పుతున్నాయి. దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన ప్రభావం పసిడితో పాటు వెండిపై కూడా పడింది. దీంతో పాటు దేశీయంగా ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడం వంటి పరిణామాలు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. డాలర్ కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అటుగా పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేస్తున్న ముదపరులు.. పసిడి నుంచి పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు.
ముంబై బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 1,410 రూపాయలు తగ్గి 40,200కు రూపాయల దిగువకు చేరిపోయింది. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు ఒక కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు తగ్గి 28,050 రూపాయల నుంచి 27,500 రూపాయలకు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 27,900 రూపాయల నుంచి 27,350 రూపాయలకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే... ఔన్స్ బంగారం ధర పదిన్నర నెలల కనిష్ఠ స్థాయిలో 1,132.15 డాలర్లకు చేరుకుంది. ఏడాదిలో తొలిసారిగా యుఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచింది. వచ్చే ఏడాది మరింతగా వడ్డీ రేట్లను పెంచవచ్చన్న సంకేతాలను కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. బంగారం ధరలు రానున్న కాలంలో మరింతగా తగ్గవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more