బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్.. రూ.99లకే అన్ లిమిటెడ్ కాల్స్ BSNL starts unlimited call offer for Rs 99, off-net for Rs 339

Bsnl starts unlimited call offer for rs 99 off net for rs 339

West Bengal, Reliance Jio, Kolkata, Bihar, Jharkhand, Idea Cellular, BSNL, Bharti Airtel, Assam, Airtel, vodafone, gujarat, madya pradesh, maharastra, rajasthan

The rate will be applicable in Kolkata, West Bengal, Bihar, Jharkhand, Assam, Gujrat, MP, Chhattisgarh, and Maharashtra & Rajasthan for within network calls.

బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్.. రూ.99లకే అన్ లిమిటెడ్ కాల్స్

Posted: 12/17/2016 12:42 PM IST
Bsnl starts unlimited call offer for rs 99 off net for rs 339

రిలయన్స్ కమ్యూనికేషన్ రాకతో దశాబ్దకాలనికి పూర్వం టెలికాం రంగంలో సేవలందించే సంస్థలు ఒక్కసారిగా కుదుపులకు గురయ్యాయి. అయితే అప్పుడున్న 2జీ సర్వీసులలోనే రిలయన్స్ పెను మార్పులను తీసుకువచ్చింది. సెల్ ఫోన్ అంటే సోషల్ స్టేటస్ అనే క్రమం నుంచి అన్నివర్గాల ప్రజలకు అవసరమైన సాంకేతిక పరికరం అన్నట్లుగా మార్పులను సాధ్యం చేసింది. తాజాగా ఇప్పుడు రిలయన్స్  జియో ఉచిత ఆపర్ ను మార్చి 31 వరకు పోడగించడంతో.. ఇతర సంస్థలు కూడా తమ కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి.

తాజాగా బీఎస్ఎన్ఎల్ కూడా ఈ భాటలోనే పయనిస్తుంది. తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అపర్ తో పరిమిత ఉచిత డేటా ఆఫర్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఇందుకోసం పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదని కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచునుంది.
 
అప్పుడే అవేశపడకండీ.. అసలు చిక్కముడి ఇక్కడుంది. ఈ రేట్ కేవలం కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్లు నెట్వర్క్ పరిధిలోని కాల్స్కు అందుబాటులో ఉంటుంది. అయితే ఇతర సర్కిళ్లలో ఈ ఆపర్ ను రూ 99కి బదులు.. రూ.119 నుంచి రూ.149కు కల్పించనుంది. అదేవిధంగా కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్వర్క్కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1జీబీ డేటాను అందుబాటులో ఉంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tariff war  BSNL  Reliance JIO  Rs 99 offer  unlimited voice calls  3G data  

Other Articles