మోడీ సర్కార్ కు మరో సవాల్ విసిరిన అరవింద్ కేజ్రీవాల్ Set up commission to probe source of political parties' funds: Kejriwal

Set up commission to probe source of political parties funds kejriwal

Prime Minister Modi, Narendra Modi, Arvind Kejriwal, Income Tax, political donors, donations, political parties, independent commission, prashant bhushan, yogendra yadav, old comrade support

Delhi Chief Minister Arvind Kejriwal demanded setting up of a commission to probe source of funding of political parties. He also questioned the central government’s decision to exempt political parties from paying income tax while depositing old 500 and 1,000 rupee notes.

మోడీ సర్కార్ కు మరో సవాల్ విసిరిన అరవింద్ కేజ్రీవాల్

Posted: 12/18/2016 10:51 AM IST
Set up commission to probe source of political parties funds kejriwal

అవినీతి రూపుమాపడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశానని ప్రధాని నరేంద్రమోడీ ప్రజల్లోకి వెళ్లి విసృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర నిర్ణయాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ అధ్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి మరో సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్రమోడీకి నిజంగా అవినీతి నిర్మూలపై చిత్తశుద్ది వుంటే.. రాజకీయ పార్టీలకు విరాళాలొచ్చే మార్గాలపై విచారణ చేయడానికి ఒక స్వతంత్ర కమిషన్ ను ఏర్పాటుచేయాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

రాజకీయ పార్టీలు డిపాజిట్‌ చేసిన రూ. 500, రూ, 1000 నోట్లపై ఆదాయపు పన్నును ఎందుకు మినహాయించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మధ్య జరిగిన భేటిలో రాజకీయ విరాళాలకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చి వుంటుందని అయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లోనే అవినీతి పెద్ద ఎతున వుంటుందని యావత్ దేశ ప్రజలు గుడ్డిగా అరోపిస్తున్నారని, ఈ క్రమంలో ముందుగా రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై స్వతంత్ర కమీషన్ తో విచారణ జరిపించాలన్నారు.

బ్యాంకుల్లో రూ. 2, 5 లక్షలు డిపాజిట్‌ చేసిన సాధారణ ప్రజలు విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రాజకీయ పార్టీలకు ఎందుకు మినహాయింపు కల్పించారన్న ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు రూ. 2,500 కోట్లు డిపాజిట్‌ చేసినా దర్యాప్తు ఎందుకు జరగడం లేదని ఆయన నిలదీశారు. ఏ నాయకుడైనా ప్రజల కోసమేనని, ప్రజలు లేనిదే నాయకుడు ఎక్కడి నుంచి వస్తాడని, ప్రజలు చేయనిదే నేత ఎలా అవుతాడని, అన్నింటికీ ప్రజలు కావాల్సిన నాయకులకు మాత్రం ప్రజలలా కాకుండా వీఐపీ ట్రీట్ మెంట్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా తప్పు. అందుకే గత ఐదేళ్లుగా రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న బ్యాంకు అకౌంట్‌ల వివరాలతోపాటు, నిధులొచ్చే మార్గాలపై విచారణ చేయడానికి స్వతంత్ర కమిషన్  ఏర్పాటు చేయాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles