చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఐటీ దాడులు.. అమ్మ మరణం అనంతరమే ఎందుకు? | Ram Mohana Rao behind shekar reddy.

It raids tamil nadu chief secretary residence

Shekar Reddy Ram Mohan Rao, Ram Mohana Rao, Tamil Nadu Chief Secretary Ram Mohana Rao, Chief Secretary Ram Mohana Rao, Ram Mohana Rao Jayalalitha, Ram Mohana Rao assets, Ram Mohan Rao Scam

Income Tax raids Tamil Nadu Chief Secretary Ram Mohana Rao's residence in Chennai.

ITEMVIDEOS:ఇంతకీ రామ్మోహనరావు కథేంటి?

Posted: 12/21/2016 10:52 AM IST
It raids tamil nadu chief secretary residence

రామ్మోహనరావు తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ ఉదయం నుంచి న్యూస్ చానెళ్లలో ఆ పేరు మారుమోగిపోతుంది. ఉన్నత పదవిలో ఉన్న ఆయనగారి ఇంటిపై ఆదాయపు పన్నుల శాఖ దాడులు ఎందుకు చేస్తోంది. సంచలనం రేపుతున్న ఈ రైడ్లు వెనకాల అసలు వ్యవహారం పరిశీలిస్తే...

1985 బ్యాచ్ కు చెందిన రామ్మోహనరావు అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రికి సెక్రటరీ-ఐగా విధులు నిర్వహించారు. ఈ యేడాది మొదట్లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్శ‌ద‌ర్శి రామ్మోహ‌న్‌రావు నియమితులయ్యారు. జయలలిత ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే ఆయన్ని ఏరి కోరి సీఎస్ గా నియమించింది. (నల్ల శేఖరుడు)

ఇక జయ చనిపోయాక ఆమెకు దగ్గరి వ్యక్తులపై ఐటీ దాడులు చేస్తూ వస్తోంది. ప్రముఖ కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు మెంబర్(మాజీ) శేఖర్ ఇంట్లో గుట్టలు గుట్టలు నగదు, బంగారం బయటపడి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈడీ చేస్తున్న విచారణంలో శేఖర్ రెడ్డి, రామ్మోహనరావు లింకులు బయటపడటం, అసలు శేఖర్ రెడ్డికి ఇసుక కాంట్రాక్టులు ఇప్పించటంలో రామ్మోహనరావు హస్తం ఉన్నట్లు పక్కా ఆధారాలు లభించటంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ఈ రోజు సోదాలు ప్రారంభించినట్లు సమాచారం.

 

ఉద‌యం 5.30 గంట‌ల నుంచి చెన్నైలోని రామ్మోహనరావు ఇంటితోసహా ఒకేసారి ఏడు చోట్ల త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్మ‌ద‌ర్శి హోదాలో ఉన్న వ్య‌క్తిపై ఐటీ దాడులు జ‌ర‌ప‌డం ఇదే ప్ర‌థ‌మం. ఐటీ అధికారులు అక్క‌డి మ‌రికొంత మంది ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు, అన్నాడీఎంకే నేతలపై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles