42 రోజులు గడుస్తున్నా బ్యాంకులు, ఏటీఎం ల వద్ద ప్రజల పడిగాపుల వ్యధలు మాత్రం తీరటం లేదు. పూర్తి స్థాయిలో నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవటం, 90 శాతం ఏటీఎంలు ఇంకా మూసేసి ఉండటం, వచ్చిన నోట్లు వచ్చినట్లే జనాల మధ్య రోటేట్ కావటం, బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు తక్కువై పోవటం ఇలా కారణాలేవైనా ఇబ్బందులు మాత్రం ప్రజలే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే త్వరలో ఈ కష్టాలు కాస్త తీరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఏటీఎంల నుంచి కేవలం 2500 రూపాయలను మాత్రమే విత్డ్రా చేయడానికి నిబంధన ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ పరిమితిని ఎత్తేయనున్నట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటన చేసింది. ఆర్థిక మంత్రి(మినిస్టర్ ఆఫ్ స్టేట్) సంతోష్ గంగ్వార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను డిసెంబర్ 30వ తేదీ తర్వాత నుంచి ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 30 తర్వాత కొత్త నోట్లతోసహా చెలామణి అయ్యే ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతాం. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఒకసారి రూ. 2500 మాత్రమే తీసుకోడానికి వీలున్న విషయం తెలిసిందే. అలా కాకుండా, మన ఖాతాలో ఉన్న మొత్తం.. బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉందని వివరించిన ఆయన ఈ కష్టాలు తాత్కాలికమైనవే అని, త్వరలో వీటిని సడలిస్తామని తెలిపాడు.
ఇంతకు ముందు ఆర్థిక కార్యదర్శి అశోఖ్ చవాసా కూడా డిసెంబర్ 16న త్వరలో విత్ డ్రా పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. ఇక ఒక్క ఏటీఎంల నుంచే కాదు, ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి రూ. 24వేలు మాత్రమే తీసుకోడానికి అవకాశం ఉండగా. డిసెంబర్ 30 తర్వాత దానిపై కూడా మార్పులు చేయబోతున్నారన్న స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more