తమిళనాడులోనే ఐటీ దాడులు ఎందుకు?నిజంగానే రాజకీయ కుట్ర ఉందా? | why IT raids in Tamil Nadu only.

It raids on topmost bureaucrats in tamil nadu

Tamil Nadu IT Raids, Politics behind IT raids, Paras mal Lodha arrest, Chennai industrialist Shekar Reddy, Shekar Reddy black money, Chennai airport New Notes, Paras mal Lodha, Satya Prabha relative, CS Ram Mohan Rao,

Politics behind Tamil Nadu IT raids.

నోట్ల కుట్రలు మొత్తం అక్కడే ఎందుకు?

Posted: 12/22/2016 11:14 AM IST
It raids on topmost bureaucrats in tamil nadu

అమ్మ మరణానంతరం తమిళనాడులో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు సినిమాను తలపిస్తున్నాయి. రాజకీయ కుట్ర లేదని బీజేపీ మొత్తుకుంటున్నప్పటికీ, పన్నీర్ సెల్వం ప్రధానిని కలిసివచ్చాకే ఈ దాడులు ఎక్కువ కావటం, మొత్తం వ్యవహారం చూస్తుంటే మాత్రం అనుమానాలు కలగక మానవు. దీనికి తోడు అమిత్ షా ఇళ్లపై ఎందుకు దాడులు జరగవంటూ మమతా బెనర్జీ లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇక వరుసగా టాప్ బ్యూరోక్రట్ లు, అన్నాడీఎంకే కీలక నేతలు, అనుచరుల ఇళ్లలపై ఇన్ కంట్ టాక్స్ అధికారులు దాడులు చేయటం కలకలం రేపుతోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ను టార్గెట్ చేసి పెద్ద మొత్తంలోనే ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. 24 గంటలుగా జరిగిన ఈ దాడుల్లో ఐదు కిలోల బంగారం, 30 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

అన్నానగర్ లో నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన ఈ సోదాలు ఈ ఉదయం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కీలకపత్రాలతోపాటు బంగారం, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిన్న సాయంత్రం బ్లాక్ మనీ బడా బాబు శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రామ్మోహనరావ్ కి శశికళతో సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూడటం, శశికళకు క్లోజ్ అయిన మంత్రి యడపాటి పళనిస్వామి బంధువులపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

మంత్రి పళనిస్వామి బంధువు నాగరాజన్ ఇంట్లో కూడా సోదాలు జరిపిన అధికారులు ముఖ్యమైన పత్రాలను సేకరించారు. మరోవైపు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీనారాయణ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎస్‌ రామ్మోహన్‌రావు బద్రీనారాయణ వియ్యంకులు కావటం విశేషం.ఇక భారీగా అక్రమ ధనాన్ని కూడబెట్టి సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకున్న టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, తమిళనాడు వ్యాపారి శేఖర్ రెడ్డి కేసులో మరో పెద్ద చేపను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.

కోల్ కతా కేంద్రంగా నిర్మాణ రంగం సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పారస్ మాల్ లోధా శేఖర్ రెడ్డికి పూర్తిగా సహకరించారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్ట్ చేశారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో విచారణలో భాగంగా పారస్ మాల్ పేరు బయటకు వచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయన రూ. 25 కోట్ల నోట్ల మార్పిడికి పాల్పడ్డాడని, ఆ డబ్బు శేఖర్ రెడ్డిదేనని గుర్తించామని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు విచారణ అనంతరం రామ్మోహనరావును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో కొత్త సీఎస్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు పన్నీర్ సెల్వం.

1.34 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం...

ఎంత కట్టుదిట్టంగా ఉంటున్నా కొత్త నోట్లు భారీగా చేతులు మారటంపై నిఘా వేసిన నిఘా అధికారులకు భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతూనే ఉంది. డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో చేసిన సోదాలో సుమారు 1.34 కోట్ల సొమ్ము దొరికినట్లు సమాచారం. ఈ క‌రెన్సీ అంతా రూ.2000 నోట్లేన‌ని అధికారులు మీడియాకు తెలిపారు. ఐదుగురిని అదుపులో తీసుకున్న పోలీసులు ఆ డ‌బ్బుని ఎక్క‌డి నుంచి ఎక్క‌డ‌కు త‌ర‌లిస్తున్నారు? ఎవ‌రిది? అనే అంశాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles