అమెరికాలో మరోసారి జాతి వివక్షత కలకలం రేగింది. అమెరికాలో నల్లజాతీయులపై పోలీసులు అకారణంగా దాడులు జరుపుతున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తినా అక్కడి పోలీసుల వైఖరిలో మాత్రం మార్పు కనబడడంలేదు. తాజాగా ఓ పోలీస్ తల్లి కూతుళ్లను దారుణంగా హింసించిన వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. కిందపడేసి తొక్కటమేకాదు, సంకెళ్లతో బంధించటమే కాదు.. దారుణంగా హింసించినట్లు ఆ వీడియోలో ఉంది.
టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ పట్టణంలో 46 ఏళ్ల జాక్వెలిన్ క్రెగ్ కుటుంబం నివసిస్తోంది. తన ఏడేళ్ల కొడుకు చెత్త వేశాడంటూ ఓ వ్యక్తి పీక పట్టుకుని బాదటంతో క్రెగ్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఫిర్యాదు చేసినందుకు తానే ఫలితం అనుభవించాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి మీరు నల్లజాతీయులంటూ బరా బరా నేలకేసి కొట్టడం ప్రారంభించాడు. అంతేకాదు చెత్త వేయొద్దంటూ పిల్లలకు నేర్పించరా? అంటూ కుటుంబం మొత్తాన్ని కుళ్లబొడిచాడు. తల్లి కూతుళ్లను బండ బూతులు తిట్టి ఆపై దాడికి దిగాడు.
ముందుగా ఏడేళ్ల పిల్లాడిని చితక్కొడుతుండగా మధ్యలో జాక్వెలిన్ 19 ఏళ్ల కూతురు బ్రియా హైమండ్ అడ్డుకునేందుకు యత్నించింది. అంతే ఆమెపై ఎక్కడా పడితే అక్కడ చేతులు వేసి విసిరికొట్టాడు ఆ అధికారి. తర్వాత కిందపడేసి చేతులకు సంకెళ్లు వేశాడు. ఇక చివరగా జాక్వెలిన్ ను కూడా వదల్లేదు. ఆమె వెంటపడి మరీ తరిమి కిందపడేసి తన్ని చేతులకు సంకెళ్లు వేశాడు. మరో కూతురు 15 ఏళ్ల జాక్వెస్ పారిపోతుండగా అడ్డుకుని ఆమెను బంధీ చేశాడు. అలా కుటుంబం మొత్తాన్ని తన వాహనంలో ఎక్కించి జైలుకు తీసుకెళ్లాడు ఆ ఆఫీసర్.
అక్కడే ఉన్న జాక్వెలిన్ కజిన్ పోషా దానంతా తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయగా, కేవలం నాలుగు గంటల్లో మిలియన్ పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఒకవేళ ఆ పిల్లాడి ప్లేస్ లో తెల్ల జాతీయుడు ఉండి, కొట్టింది నల్ల జాతీయుడు అయినా కేసు తీవ్రత మరోలా ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కొందరిని కూడగలుపుకుని అధికార కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనకు దిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more