ఫేస్ బుక్ అలర్ట్.. ఫేక్ బాంబ్ బ్లాస్ట్ | Facebook denies Safety Check error.

Facebook refuses to admit mistake over bomb alert

Facebook Safety Check, Thailand Facebook, Bangkok Blast, Bangkok Facebook, Fake blast News Story, Facebook refuses to admit mistake, Facebook bomb alert, Thailand blast 2016

Facebook Safety Check Mistakenly Activates In Bangkok Over Fake blast News Story.

ఫేస్ బుక్ అలర్ట్ తో బాంబు దాడి జరిగింది

Posted: 12/29/2016 09:57 AM IST
Facebook refuses to admit mistake over bomb alert

ఫేస్ బుక్ చేసిన ఓ చిన్ని తప్పు ఆ దేశాన్ని కొద్ది గంటలు అతలాకుతలం చేసింది. మొత్తం దేశ అధికార యంత్రాన్నే కాదు, ప్రజలను భయాందోళనకు గురిచేసి పడేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... ఫేస్ బుక్ తన సేఫ్టీ చెక్ ఫీచర్ ను టెస్ట్ చేసే క్రమంలో దొర్లిన తప్పు గందరగోళానికి కారణమైంది.

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధ‌వారం పేలుళ్లు సంభ‌వించాయంటూ ఫేస్‌బుక్ నుంచి త‌ప్పుడు అలెర్ట్ రావ‌డంతో ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. అంతేకాకుండా దీనిపై ప్ర‌త్యేకంగా ఓ పేజీని కూడా ప్రారంభించింది. అయితే 2015 ఆగష్టులో జరిగిన దాడిలో 20 మంది మరణించారు. ఆ దాడి ఫోటోలతో పేజీగా మలిచి అలర్ట్ సందేశాలను దేశ ప్రజలకు మొత్తం పంపించేసింది ఫేస్ బుక్. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు చెప్పుకొచ్చింది. అంతే ఒక్కసారిగా అంతా కలవరపాటుకు గురయ్యారు. తమ వారికి ఏమైందోనని కంగారు వ్యక్తం చేశారు. మరోవైపు వార్తా ఛానెళ్లన్నీ గుడ్డిగా ఆ న్యూస్ ను ప్రచురించాయి. త‌ర్వాత కంగారు పడిపోయిన ఫేస్ బుక్ అది అంతా ఉత్తిదేనని వివ‌ర‌ణ ఇచ్చింది.

Facebook Bangkok Blast

అయితే దీనికంతటికి కారణం బాణ‌సంచా పేలుళ్లని తెలిసి అంతా వారినీ అనుకున్నారు. బుధ‌వారం కొంద‌రు ఆందోళ‌న‌కారులు ప్ర‌భుత్వ కార్యాల‌యంపైకి బాణ‌సంచా కాల్చారు. దీనిని పొర‌పాటున బాంబుపేలుళ్ల‌గా భావించిన ఫేస్‌బుక్ వెంట‌నే అలెర్ట్ జారీ చేసింది. దీనిని చాలామంది నెటిజ‌న్లు షేర్ కూడా చేసుకున్నారు. అయితే థ‌ర్డ్‌పార్టీ ఇచ్చిన స‌మాచారంతోనే ఈ పొర‌పాటు జ‌రిగింద‌ని ఆ త‌ర్వాత ఫేస్‌బుక్ వివ‌ర‌ణ ఇచ్చి దానిని తొల‌గించింది. అయితే తమదే తప్పు అని ఒప్పుకునేందుకు మాత్రం ఫేస్ బుక్ ససేమిరా అనటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Safety Check  Thailand  Bangkok  bomb alert  

Other Articles