తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనానికి తెరతీసిన హైదరాబాద్ శివార్లలోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ దోపిడీ కేసు చేధనలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ కేసుతో ప్రమేయం వున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే వారిని ప్రత్యేక ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని, ఈ కేసులో నిందితులుగా వున్న మరో నలుగురు వివరాలను వీరి నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, బీరంగూడ ముత్తూట్ దొంగతనం కేసులో నిందితులందర్నీ అదుపులోకి తీసుకున్న తరువాతే అరెస్టు చూపాలని పోలీసులు బావిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే, ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న వార్తలు పోలీసులు అధికారికంగా దృవీకరించడం లేదు. ఇదిలావుండగా, సర్దార్జీతో పాటు మరో ముగ్గురి వద్ద భారీ మొత్తంలో బంగారం ఉండటంతో వారి ప్రతి కదలికపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచినట్టు సమాచారం. సర్దార్ జీ వేషధారణలో ఉన్న ప్రధాన నిందితుడు, మిగత వారు పాత నేరస్తులు కావడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముంబైలో గాలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కర్ణాటకలోని వాడీలోని వారి స్థావరాల్లో ముత్తూట్‌లో దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఆరుగురు నిందితుల కదలికలను తెలుసుకునేందుకు 35 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దోపిడీ తర్వాత రాష్ట్ర సరిహద్దులు దాటేలోపు బైక్, స్కార్పియోలు రెండు సార్లు కలుసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఏ మార్గంలో వెళితే బాగుంటుందని రెక్కీ చేసుకుని దోపిడీ తర్వాత అదే మార్గంలో వాడీ వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ ఆరుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్లే అని, జైలులోనే కలసి ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉంటారని సీపీ సందీప్ శాండిల్యా అనుమానం వ్యక్తం చేశారు.
దోపిడీ చేయడానికి ముందు మహారాష్ట్ర(ఎంహెచ్) రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను స్కార్పియోకు వినియోగించారు. పరిగి బస్టాండ్‌లో బైక్‌ను పార్క్ చేసిన సమయం లో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను వాడారు. నేరం జరిగే రోజుకు ఘటనాస్థలికి 5 కిలోమీటర్ల ముందు తమ బండి నంబర్ ప్లేట్‌ను ఏపీకి మార్చారు. అయితే పలుమార్లు రెక్కీ నిర్వహించిన దొంగలు చివరకు డిసెంబర్ 27న దొంగతనానికి స్కెచ్ వేయగా, అదే సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని చూసి దొంగలు దోపిడీ ప్లాన్ ను విరమించుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 28న ప్రణాళిక ప్రకారం ముత్తూల్ లో దోపిడీకి పాల్పడ్డారు. కాగా ఈ కేసులో మరో నలుగురి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more