మీడియా మొఘ‌ల్ రామోజీకి ఏమైంది? | Ramoji Rao hospitalized due to illness.

Eenadu ramoji rao hospitalized

Eenadu head, Ramoji Rao, Ramoji Rao Health, Eenadu Ramoji Rao, Ramoji Rao illness, Ramoji Rao Hospitalized, Padma Vibhushan Ramoji Rao

Eenadu head, Padma Vibhushan Ramoji Rao Hospitalized.

ఈనాడు రామోజీరావుకి ఏమైంది?

Posted: 01/05/2017 08:21 AM IST
Eenadu ramoji rao hospitalized

మీడియా మొఘ‌ల్, ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పరిస్థితి క్లిష్టంగా మారటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. వెన్నునొప్పు, వైర‌ల్ ఫీవ‌ర్‌, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.

సోమ‌వారమే సోమాజీగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రిలో చేర్చగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియ‌ర్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం కోలుకుంటున్నార‌ని, బుధ‌వారం కొద్దిగా ఆహారం కూడా తీసుకున్నార‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. సీనియ‌ర్ జనరల్ ఫిజీషియ‌న్ డాక్ట‌ర్ ఏమ్వీ రావు, ప‌ల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్ న‌వనీత్‌సాగ‌ర్ బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తున్న‌ట్టు పేర్కొన్నాయి.

కాగా, 80 ఏళ్ల రామోజీరావు రామోజీ గ్రూపులతోపాటు, ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్ ఉత్పత్తులు, ఉషాకిరణ్ మూవీస్ పేరిట సినిమా రంగంలో కూడా ఉన్నాడు. 2016 లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ తో సత్కరించింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padma Vibhushan  Eenadu chief  Ramoji Rao  hospitalized  

Other Articles