నెట్టింట్లో సంచలనంగా మారిన ‘చోటా భీమ్’ Two year old miraculously saves twin brother

Two year old saves his twin brother from being crushed beneath fallen dresser

Ricky Shoff, Bowdy Shoff, Brock Shoff, twin brother, american twins, dressing table, adult sight, trending video, viral video, chota bheem viseo

A two-year-old boy has saved his twin brother from being crushed beneath a fallen dresser by pushing the dresser so he could roll out.

ITEMVIDEOS: నెట్టింట్లో సంచలనంగా మారిన ‘చోటా భీమ్’

Posted: 01/04/2017 09:12 PM IST
Two year old saves his twin brother from being crushed beneath fallen dresser

అమెరికాలోని రెండేళ్ల బుడ్డోడు ఛోటా భీమ్ మాదిరిగా ఏకంగా నెటింట్లో సంచలనంగా మారాడు. తన కవల సోదరుడిని రక్షించేందుకు ఈ బుడతడు చేసిన ప్రయత్నం నెట్ జనులను ఎంతగానో అకర్షిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఉతాలోని ఒరెమ్ సిటీకి చెందిన కేళీ షాఫ్ దంపతులకు సంతానం ఇద్దరు కవలలు. వారి పేర్లు బౌడీ షాఫ్, బ్రాక్ షాఫ్. అయితే వీరిద్దరూ ఇంట్లో సరదాగా అడుకుంటున్నారు. ఇంతలో వీరికి ఓ చిక్కు వచ్చి పడింది. వీరు ఆడుకుంటుండగా డ్రెస్సింగ్ డేబుల్ వారిపై పడింది. అయితే బౌడీకి కాళ్లమీద పడటంతో వెంటనే ఎలాగోలాగ తప్పించుకున్నాడు. అప్పుడు మొదలైంది అసలు పోరాటం.. తాను తప్పించుకున్నాడు కానీ, సోదరుడు బ్రాక్ షాఫ్ ఆ టెబుల్ చిక్కుకుని నానా తిప్పలు పడ్డాడు.

లేచి నిలబడిన బౌడీ తన సోదరుడ్ని చూసి కంగారు పడ్డాడు. ఏకంగా టేబుల్ ను ఎక్కి వెనక్కు వెళ్లాడు. అయినా అతనికి ఎలాంటి అలోచనా రాలేదు. అలా టేబుల్ ను పక్కకు జరిపేందుకు బౌడీ చేసిన ప్రయత్నాన్ని మనం వీడియోలో చూడవచ్చు. దాదాపు రెండు నిమిషాల పాటు కష్టపడి బ్రాక్ ను గండం నుంచి గట్టెక్కించాడు. మొదట టేబుల్ ను ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైన బౌడీ.. అలాగే కొద్దిసేపు పోరాడినా ఫలితం దక్కలేదు. ఇక ఏకంగా ఛోటా భీమ్ ను తలచుకుని టేబుల్ ను కాస్త పక్కకు నెట్టాడు. వెంటనే బౌడీ పక్కకు జరిగి హమ్మయ్యా అనుకున్నాడు.

ఈ వీడియోను వీరి ఫాదర్ రికీ షాఫ్ తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దాంతోపాటుగా ఓ మెసేజ్ ఇచ్చారు. డేబుల్స్, ఇతర వస్తువులు ఏమైనా ఉంటే వాటిని గోడకు అటాచ్ అయ్యేలా చూసుకుంటే ఇలాంటి ఘటనలు తలెత్తవని సూచించారు. పిల్లలు ఆడుతూ అల్లరి చేస్తున్నారని మేము భావించాం.. కానీ సీసీటీవీ చూస్తే జరిగింది వేరు అని పోస్ట్ లో పేర్కొన్నాడు. లైట్ వెయిట్ టేబుల్ కావడంతో ప్రమాదం తప్పిందని రికీ షాప్ అన్నారు. మొత్తానికి రెండేళ్ల బుడ్డోడు బ్రాక్.. కవల సోదరుడి కోసం చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles