ఒకదేశం వెనకబాటు తనానికి, ఆర్థికంగా ఎదుగుదల లేకపోవటానికి నిరుద్యోగం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఇదే ప్రధాన కారణం అని చెప్పకపోయినప్పటికీ, పని పాట లేకుండా ఖాళీగా తిరిగే బాబులు ఈజీ మనీ కోసం క్రైమ్ లకు పాల్పడుతుంటం మాత్రం చూస్తున్నదే. ఈ దశలో తమ దేశంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు స్విట్జర్ లాండ్ ప్రేరణతో ఫిన్ లాండ్ ఓ అరుదైన నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగుల కోసం అక్కడి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం అక్కడి నిరుద్యోగులకు ప్రతి నెలా 560 యూరో డాలర్లను(మన కరెన్సీలో అక్షరాల 40 వేలు) ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. ఇంత మొత్తం సొమ్మును వారికి ప్రతినెలా ఇస్తేనే ఆ దేశంలో కనీస సౌకర్యాలు లభిస్తాయి. తద్వారా నేరాలను, పేదరికాన్ని, మెల్లిగా నిరుద్యోగాన్ని కూడా పారద్రోలచ్చేనేది ఆలోచన.
గతేడాది దీనిపై ఓటింగ్ నిర్వహించగా మెజార్టీ ప్రజలతోపాటు, ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కూడా ప్రభుత్వం దీనిని అమలు పరిచేందుకు సిద్ధమైపోయింది. ఇదిలా ఉండగా, ఈ పథకంపై కొందరు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగులు సోమరిపోతులవుతారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ పథకంతో నిరుద్యోగులు మరిన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నారు. ఈ పథకాన్ని తొలి దశలో రెండు వేల మంది నిరుద్యోగులకు మాత్రమే పరిమితం చేయనున్నామన్నారు.
ఇందులో ఉన్న మరో బంఫరాఫర్ ఏంటంటే... పథకం ద్వారా లబ్ధి పొందుతున్న నిరుద్యోగులకు ఎక్కడైనా ఉద్యోగం లభిస్తే కనుక, ఈ ప్రయోజనాన్ని వదలుకోవాల్సిన అవసరం లేదు. కానీ, స్వచ్ఛందంగా వద్దని అనుకుంటే మాత్రం ఆ ప్రయోజనాన్ని వదులుకోవచ్చు. 2019 వరకు ప్రయోగాత్మకంగా ఇది అమలు కానుంది. ఇంతకు ముందు ఇటలీ, కెనడాలో కూడా ఇటువంటి ప్రయోగం అమలు చేయగా, అది సత్ఫలితాలను ఇవ్వటం విశేషం. 5.5 మిలియన్ జనాభాతో, 8.1 శాతం నిరుద్యోగ శాతం ఉన్న ఫిన్ లాండ్ లో ఈ ప్రయోగం కూడా ఫలించొచ్చనే అర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more