అమ్మాయిల మధ్య గోడవలో తలదూర్చి.. ఇలా.. Officer at Rolesville High slams girl to the ground in video

Officer at rolesville high slams girl to the ground in video

Rolesville High School, police office, Slammed, Girl student, North Carolina, viral video, Officer body slamming female student at Rolesville High School, Officer body slamming female student, Officer body slamming student, Officer slamming student

Unable to get a few junked currency notes exchanged, a frustrated poor woman became topless in front of RBI regional office in the national capital New Delhi.

ITEMVIDEOS: అమ్మాయిల మధ్య గోడవలో తలదూర్చి.. ఇలా..

Posted: 01/06/2017 03:23 PM IST
Officer at rolesville high slams girl to the ground in video

అడవాళ్లు, యువతులు, అమ్మాయిల ఇలా వారి వయస్సును బట్టి ఎలా పిలిచినా.. వారి మధ్యలో జరుగుతున్న వివాదాల్లోకి వెళ్లాలంటే.. కాసింత ధైర్యంతో కూడుకున్న పనేనని ఇప్పటికే ఎన్నో జోకులు, నానుడ్లు చెబుతున్నాయి. అయితే వాటిని పెడచెవిన పెట్టి.. మరీ తన విధుల్లో భాగంగా తన పని తాను చేస్తానని పూనుకున్నాడు ఓ పోలీసు అధికారి. అయితే సముదాయించి ఘర్షణపడుతున్న ఇద్దరమ్మాయిలను విడదీయాల్సింది పోయి.. ఏకంగా తాను సహనం కోల్పోయి చేయకూడని పని చేశాడు. అంతే ఇప్పుడు తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాడు. కాదు కాదు.. తనపై చర్యలు తీసుకున్నందుకు గాను తమ శాఖ అధికారులకు వివరణలు ఇచ్చుకుంటున్నాడు.

అసలేం జరిగిందంటే.. పోలీసును కూడా తంటాలు పెట్టి.. మరీ ఉద్యోగానికే ఎసరు తీసుకువచ్చిన ఘటన ఎక్కడ జరిగింది. అన్న వివరాల్లోకి ఎంటరైతే.. అమెరికాలో నార్త్‌ కరోలినాలోని రోల్స్‌విల్లె హైస్కూల్లో ఇద్దరు బాలికల మధ్య ఏర్పడ్డ చిన్న వివాదం పెద్ద దుమారం రేపింది. ఇద్దరు విద్యార్థుల మధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దదయ్యింది. ఇద్దరూ కలియబడి కొట్టుకుని కిందపడ్డారు. ఈ తతంగాన్ని మరో అమ్మాయి తన సెల్‌ఫోన్‌తో వీడియా తీసింది. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ పోలీస్‌ అధికారి వచ్చి ఓ అమ్మాయిని పైకెత్తి నేలపైన బంతిలా విసిరికొట్టాడు.

దీంతో ఆ అమ్మాయి అక్కడే పడిపోయింది. బాధతో ఏడుస్తూ విలవిలలాడిపోయింది. పోలీస్ అధికారి ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయాడు. మొత్తం ఎపిసోడ్‌ను వీడియో తీసిన అమ్మాయి దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇది వైరల్‌ కావడం, పోలీసు అధికారిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారి రూబెన్‌ డి లాస్‌ శాంటోస్‌ను లీవ్‌పై పంపారు. కాగా అమ్మాయిల మధ్య వివాదం ఏర్పడటానికి కారణం ఏంటి, పోలీసు అమ్మాయిని ఎత్తి కిందపేడేయడానికి కారణం ఏంటీ అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rolesville High School  police office  Slammed  Girl student  North Carolina  viral video  

Other Articles