పరిశ్రమల స్థాపన, విస్తరణ, ఇత్యాదుల పేరుతో బడాబాబులకు వేల కోట్ల రూపాయలను ఇచ్చి చేతులు కాల్చుకున్న ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డీమానిటైజేషన్ ఫుణ్యమా అంటూ డబ్బులు పుష్కలంగా రావడంతో పెద్ద మనస్సు చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు రూ. 22.23 లక్షలు విరాళమిచ్చింది.
నిరుపేద కుటుంబాలకు వైద్య సదుపాయం అందించేందుకు మొబైల్ క్లినిక్ ఏర్పాటుచేయడానికి హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యుమన్ వెల్ఫేర్ (హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ)కు ఈ విరాళం అందజేసింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజ్నిష్ కుమార్ ఈ మేరకు చెక్కును హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ డైరెక్టర్ మహ్మద్ రఫీయుద్దీన్‌కు అందజేశారు. ఈ మొబైల్ క్లినిక్ వచ్చేవారం నుంచి సేవలు అందించనుంది.
మురికివాడల్లోని 500 మందికి ప్రతిరోజూ ఉచితంగా వైద్యసేవలు అందించనుంది. ఈ మొబైల్ క్లినిక్‌లో రిసెప్షన్ డెస్క్, డాక్టర్ క్యాబిన్, లాబోరేటరి, ఔషధాలు దుకాణం తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీఎస్ఆర్లో భాగంగా ఇప్పటికే పలు పారిశుద్ధ్య, వైద్య, విద్య ప్రాజెక్టుల కోసం స్వచ్ఛంద సంస్థలకు రూ. 10.50 కోట్ల మేర విరాళాలు అందజేసిందని అధికారులు తెలిపారు. డిజిటలైజేషన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more