తప్పుల తడకగా.. దేశ వృద్దిరేటు గణంకాలు.. 7.1 per cent GDP estimate erroneous, says Icra

7 1 per cent gdp estimate erroneous says icra

demonetisation, demonetisation impact, demonetisation effects, gdp, gross domestic product, crisil, gdp india, demonetisation gdp, economy news

Rating agencies have said the GDP growth projection released by the government on Friday is overestimated “given the impact of demonetisation on actual activity from mid-November 2016 onward”

తప్పుల తడకగా.. దేశ వృద్దిరేటు గణంకాలు..

Posted: 01/07/2017 08:09 PM IST
7 1 per cent gdp estimate erroneous says icra

కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించిన అంచనాలు తప్పుల తడకగా వున్నాయిని.. డీమానిటైజేషన్ తరువాత పరిణామాలను గణించకుండా, అసలు వాటిని కలపకుండానే ఎలా వృద్ది రేటును అంచనా వేస్తారని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఐక్రా ఎత్తి చూపింది. భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు పడిపోతుందంటూ కేంద్రం చేసిన వాదన ఎలా వున్నా.. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలను డేటాలో ప్రభుత్వం కలుపకపోవడంతో ప్రధాన లోపంగా ఐక్రా పేర్కోంది.  

2016-17లో దేశ వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోతుందని ఈ ఏజెన్సీ అంచనావేసింది. 2016 నవంబర్ నెల మధ్య నుంచి పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రారంభమైంది. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అక్టోబర్ వరకున్న డేటాతోనే ప్రభుత్వం వృద్ధి అంచనాలు ప్రవేశపెట్టిందని ఇది ఎలా సాధ్యమని ఐక్రా ప్రశ్నించింది. ముందటి సంవత్సరాలకంటే ప్రస్తుత అంచనాల్లో చాలా తప్పులున్నాయని, నగదుతో ముడిపడి ఉన్న కన్స్ట్రక్షన్ సెక్టార్ లాంటి వాటిలో తప్పులు దొర్లిన్నట్టు ఐక్రా ఓ ప్రకటనలో తెలిపింది.
 
2017లో వృద్ధిపై సీఎస్ఓ ప్రకటించిన ముందస్తు అంచనాల్లో ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం లేదని, వారు ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రథమార్థ డేటానే పరిగణలోకి తీసుకున్నట్టు ఐక్రా చెప్పింది. కానీ తయారీరంగం, వ్యవసాయం, విద్యుత్, నిర్మాణ వంటి సబ్-సెక్టార్లలో ప్రభుత్వం విడుదల చేసిన ముందస్తు అంచనాల కంటే ఇంకా ఎక్కువగానే వృద్ధి రేటు పడిపోతుందని ఐక్రా వివరించింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీల మూడో క్వార్టర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడం, రబీ ఉత్పత్తిపై ముందస్తు అంచనాలు కూడా గణాంకాల కచ్చితత్వంపై ప్రశ్నార్థకంగా మారినట్టు ఐక్రా తన ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles