ఫేస్‌బుక్‌లో ట్రెండవుతున్న నాలుగో సింహం.. Honest SI returns wallet, trends on Facebook

Cop returns delhi business man s purse he found on road

Jagpreet Singh, Preet Vihar, nizammuddin, Madan Singh, honest delhi cop, Delhi traffic police, US dollar, Facebook, Sarai Kale Khan, Nizamuddin bridge, trending news

A Delhi police sub-inspector trended on the social media, after an east Delhi businessmen Jagpreet Singh took to Facebook to share the story of the cop.

ఫేస్‌బుక్‌లో ట్రెండవుతున్న నాలుగో సింహం..

Posted: 01/10/2017 05:33 PM IST
Cop returns delhi business man s purse he found on road

నిజాయితీ వున్నవారు కనీసం ప్రచారం కూడా కోరుకోరు. తన బాధ్యతలను తాను నిర్వర్తిస్తున్న క్రమంలో ఎందుకొచ్చిన ప్రచారం. ఒక విధంగా అది కూడా లంచం తీసుకోవడమేనన్న దోరణి అవలంభిస్తే.. అందులోనూ పోలీసు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వారు అలా వ్యవహరిస్తే.. నిజంగా విస్మయానికి గురవ్వడం మనవంతు అవుంతుంది. కానీ నిజంగా అలాంటి వ్యక్తి వున్నాడు అయనే మదన్ సింగ్. ఈయన నిజాయితీకి మారుపేరు. తమ శాఖలో తనకన్నా తక్కువ క్యాడర్ వున్నవారే కాదు.. ఉన్నత క్యాడర్ వారు కుడా మదన్ సింగ్ ను చూస్తే..గౌరవిస్తారు. అదీ అతని నిజాయితీ.

మరో నాలుగేళ్లలో రిటైరవుతున్న వ్యక్తి ఓ బిజినెస్ మెన్ వల్ల ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలుపెట్టారు. అదెలా అంటే తాను పోయిందనుకున్న రూ. 50 వేల విలువైన నగదు ఉన్న తన వాలెట్ మదన్ సింగ్ తిరిగిచ్చాడు. ఈనెల ఏడోతేదీ ఉదయం 9.30 గంటల సమయంలో జగ్రీత్ సింగ్ అనే వ్యాపారి సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలోని నిజాముద్దీన్ బ్రిడ్జి సమీపంలో తన పర్సు పోగొట్టుకున్నారు. ఇంటికెళ్లే మార్గంలో తన కారు ఆగిపోగా, దానిని స్టార్ట్ చేయడానికి తోయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పర్సు పడిపోయింది. రాత్రి 10.30 గంటలకు ఇంటికి వెళ్లి చూసుకోగా పర్సు లేదు.
 
ఇంతలో రోడ్డుమీద వెళ్తున్న ఓ సైక్లిస్టు ఆ పర్సు తీసుకుని వెళ్తుండటాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ మదన్ సింగ్ చూశారు. అతడిని వెంబడించి పట్టుకుని, పర్సు తీసుకున్నారు. అందులో చాలా పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, విజిటింగ్ కార్డులు ఉన్నాయి. అందులో విజిటింగ్ కార్డు మీద నెంబరు చూసి జగ్రీత్ సింగ్‌కు ఫోన్ చేశారు. పర్సులో కేవలం తన ఐడెంటిటీ కార్డు మాత్రమే ఉండి ఉండొచ్చని, డబ్బులు ఉండకపోవచ్చని అనుకుని వెళ్లిన జగ్రీత్ సింగ్ షాక్ కు గురయ్యాడు.

తన పర్సును అందుకుని చూడగా అందులో మొత్తం డబ్బు యథాతథంగా ఉంది. తాను కేవలం డ్రైవింగ్ లైసెన్సు మాత్రమే చూశానని, తర్వాత విజిటింగ్ కార్డు చూసి ఫోన్ చేశానని మదన్ సింగ్ చెప్పారు. అలాంటి నిజాయితీపరుడైన పోలీసును ఇంతవరకు చూడలేదని, చివరకు ఫొటో తీయించుకోడానికి కూడా ఒప్పుకోలేదని అన్నారు. దీంతో ఎస్ఐ మదన్ సింగ్ గురించి జగ్రీత్ సింగ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అంతే, పోలీసులలో కూడా ఇలాంటి నిజాయితీపరులు ఉంటారా అంటూ ఒక్కసారిగా ఆ పోస్టుకు లైకులు, షేర్లు వెల్లువెత్తాయి.
 
కేవలం ఆ పర్సు తిరిగివ్వడమే కాదు, సదరు వ్యాపారి తనకు బహుమతిగా ఇవ్వబోయిన 5వేల రూపాయలను కూడా మదన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారట. మదన్ సింగ్ తమ శాఖకే గర్వకారణమని ట్రాఫిక్ డీసీపీ డీకే గుప్తా అన్నారు. అతడికి శాఖాపరంగా తగిన రివార్డు ఇప్పిస్తామని, ఇతరులు కూడా ఆయనను చూసి స్ఫూర్తి పొందాలని చెప్పారు. అల్వార్‌కు చెందిన మదన్ సింగ్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. కొడుకులిద్దరిలో ఒకరు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుండగా మరొకరు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagpreet Singh  Preet Vihar  nizammuddin  Madan Singh  honest delhi cop  facebook  trending news  

Other Articles