పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఘనకార్యాలను సోంత పార్టీ నేతలే బహిర్గతం చేస్తున్నా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మాత్రం వచ్చినట్లు లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నిత్యం వివాదాల మధ్య వుంటూ వార్తల్లో నిలుస్తున్నా.. పార్టీ మాత్రం అతనని వెనకేసుకువస్తుందన్న విమర్శలు వినబడతున్నాయి. టీడీపీ పార్టీ క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకునే టీడీపీ నేతలు.. చింతమనేని ప్రభాకర్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఎమ్మార్వో వనజాక్షి ఎపిసోడ్ నుంచి తాజాగా పోలీసులపై దాడి వరకు అనేక చుట్టూ అనేక వివాదాలు అలుముకున్నాయి. అయితే ఈ విషయాలు పార్టీ అధినేతకు తెలియదా..? అంటే స్వయంగా ఆయనే వనజాక్షి విషయంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చారు. అయినా చింతమనేనిలో మాత్రం ఏ మాత్రం మార్పు కానరాలేదు. ఇక పైపెచ్చు అధికారులతో ఆయన వ్యవహరిస్తున్న వైఖరి యావత్తు వివాదాస్పదం అవుతూనే వుంది.
ఈ క్రమంలో స్వయంగా టీడీపీకి చెందిన నేతలే చింతమనేని ప్రభాకర్ వ్యవహరశైలిని తూర్పారబట్టారు. పిచ్చి వేషాలు మానుకో అంటూ హెచ్చరించారు. సామాన్య ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకోం ఏ మాత్రం సహించమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఓట్లేసిన సామాన్యులకు టీడీపీలో ఎంత విలువ వుంటుందో అర్థమయ్యేలా ఈ వ్యాఖ్యలు వున్నా.. పార్టీ కార్యకర్తలతోనూ ఆయన వ్యవహరశైలి ఇలానే వుందని, దానిన సహించమంటూ తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు చింతమనేనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40 లక్షలు దండుకున్నాడని అప్పలనాయుడు ఆరోపించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఈ డబ్బు చేతులు మారిందన్నారు. అందుకు ప్రతిఫలంగా రెడ్డి అనురాధను ఎంపీపీ పీఠం నుంచి తొలగించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవి కట్టబెట్టేందుకు చింతమనేని కుతంత్రాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇందుకోసం పార్టీ మారిపోతున్నామంటూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కాగానే పెద్దస్థాయిలో లంచాలు పుచ్చుకుని, మట్టి, ఇసుకతోపాటు అభివృద్ధి పేరిట అందినకాడికి ప్రభుత్వ సొమ్ము దోచుకునంటూనే.. పైకి మాత్రం తానేమీ సంపాదించలేదంటూ చింతమనేని నంగనాచిలా వ్యవహరిస్తున్నారని చురకలేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి తన భార్య రెడ్డి అనురాధ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జెడ్పీ కార్యాలయానికి వెళ్లి రాజీనామా లేఖ అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more