నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు తమ వద్దనున్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఇక అవసరం కొద్ది కొత్త నోట్ల కోసం రోజుల తరబడి బ్యాంకులు, ఏటీయంలలోని క్యూలైన్లో నిల్చున్నా కొందరికి కేవలం రెండు వేలే లభించగా, మరికోందరికీ అవి కూడా లభించలేదు. అయితే ఆ తరువాత ఐటీ, ఇంటెలిజెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో మాత్రం వందలు, వేలల్లో కొత్త నోట్లు కొందరి వద్దకు దొడ్డిదారిన వచ్చేశాయి. ఇంకొందరి వద్దైతే ఏకంగా లక్షల కొత్త నోట్లు ఎంచక్కా వారి ఖజానాల్లోకి చేరిపోయాయి.
నల్లకుబేరుల జాబితాలో చేరిన వారెవ్వరూ బ్యాంకుల వద్ద క్యూ కట్టకుండానే ఇన్నేసి నోట్లు ఎలా పోందారు..? ఇదంతా ఏమిటి? వారికీ కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయి. సామాన్యుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ అంశమై దృష్టిసారించిన అదాయపన్ను శాఖ అధికారులలోనూ అనుమానాలు వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు ప్రభుత్వ ముద్రణా సంస్థలు, ఆర్బీఐ నుంచే డైరెక్ట్గా కొందరి ఇళ్లకు చేరినట్టు ఐటీ అనుమానిస్తోంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించాయి.
అదెలా సాధ్యం అంటారా..? కొరియర్ బాయ్ ద్వారా.. కొత్త నోట్లు అక్రమార్కుల దరి చేరాయా..? అంటే అవుననే అనుమానాలనే అదాయపన్ను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఇలా కృష్ణ కుమార్ అనే కొరియర్ బాయ్ నుంచి 20 లక్షల రూపాయల కొత్త రెండు వేల నోట్లు లభ్యం కావడమే అనుమానాలకు తావిస్తుంది. అధికారులకు సమాచారం అందడంతో.. డిసెంబర్ 15న గ్రేటర్ కైలాష్-1 ఎం బ్లాక్ మార్కెట్లో డెలివరీ కోసం వేచిచేస్తున్న కొరియర్ బాయ్ ని పట్టుకుని తనిఖీలు చేపట్టగా అతని వద్దనుంచి రెండు వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. ఈ నోట్లు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్కు చెందిన రెండు ప్రభుత్వ కరెన్సీ ప్రెస్ లలో ముద్రించినట్లు వాటి ముద్రణ వేసి వున్నాయి.
ముద్రణ సంస్థల సీల్తో ఉన్న నగదు పబ్లిక్లో పట్టుబడటం ఇదే మొదటిసారని ఇద్దరు సీనియర్ ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్, ఆర్బీఐ చెస్ట్లు తమ లొసుగులతో రాజీపడి ఇలాంటి కార్యకలాపాలేమైనా నిర్వహిస్తే, ఆర్బీఐ కచ్చితంగా తమతో మరింత సమాచారం పంచుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు చేరవేస్తున్న నగదు నిర్వహణ కంపెనీల పాత్రపై కూడా ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు పట్టుకున్న ఆ బ్యాగులు సాల్బోని, నాసిక్ ప్రెస్లకు సంబంధించినవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ రెండు ప్రెసింగ్ సంస్థలు రోజుకు 52 లక్షల పీస్ల నోట్లను ప్రింట్ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more