ఈ గ్యాంగ్ రేప్ వెనుక కథ వేరు.. నిగ్గు తేల్చిన పోలీసులు Woman who alleged gangrape held along with boyfriend

Fake rape girl and boyfriend held for blackmailing man

gang-raped, fake rape case, fake documents, engineering college on JLN Marg, charges of criminal conspiracy and extortion, crime news

A complaint of alleged rape lodged by a 22-year old girl in the city has turned out to be false and the rape accused, it now transpires, is actually a victim of honey trap and extortion.

ఈ గ్యాంగ్ రేప్ వెనుక కథ వేరు.. నిగ్గు తేల్చిన పోలీసులు

Posted: 01/14/2017 12:25 PM IST
Fake rape girl and boyfriend held for blackmailing man

ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువతి అతని నుంచి డబ్బు గుంజేందుకు గ్యాంగ్ రేప్ నాటకానికి తెరతీసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి సమీపంలోని స్వాయి మధోపూర్ జిల్లా బజీర్‌పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి పరీక్ష రాసేందుకు జైపూర్ వస్తే తనపై సందీప్ లాంబా, బ్రిజేష్ లతో పాటు నలుగురు యువకులు కలిసి తనపై సామూహిక అత్యాచారం జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైపూర్ పోలీసులు యువతి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

సదరు యువతి సందీప్ లాంబా అనే యువకుడితో కలిసి ఓ అద్దెగదిలో ఉంటూ ఏకాభిప్రాయంతో సెక్స్ కు అంగీకరించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆపై రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండు చేస్తూ యువకులను బ్లాక్ మెయిలింగ్ చేసింది. డబ్బు ఇచ్చేందుకు యువకులు నిరాకరించడంతో యువతి కాస్తా గ్యాంగ్ రేప్ కథకు తెర లేపిందని పోలీసులు తేల్చారు. యువతి తన బాయ్ ఫ్రెండ్ అయిన రాంఫాల్ మీనాతో కలిసి ఈ గ్యాంగ్ రేప్ నాటకం ఆడిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ముందుగా సెక్స్ కు అంగీకరించిన యువతి అనంతరం యువకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు పురుగుల మందు తాగినట్లు నటించిందని పోలీసులు చెప్పారు. రాంపాల్ మీనాతోపాటు సదరు యువతి గతంలో ఫోర్జరీ, డబ్బు గుంజిన నేరాల్లో నిందితురాలని తేలింది. దీంతో పోలీసులు నిందితురాలైన యువతితోపాటు దీనికి సహకరించిన ఆమె బాయ్ ఫ్రెండ్ లను అరెస్టు చేసి వారినుంచి ఆరు మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles