బెంగుళూరు సిలికాన్ వ్యాలీలో న్యూఇయర్ రోజున జరిగిన బహిరంగ లైంగిక వేదింపుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపినా.. ఇంకా అక్కడి ప్రజల్లో మాత్రం మార్పు వచ్చినట్లు కనబడటం లేదు. టికెట్ ఖరీదు పోనూ మిగతా చిల్లర ఇవ్వాలని అడిగిన యువతి పట్ల బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని చెబుతూ లైంగిక వేధింపులకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వివరాలను ఫేస్బుక్లో ఉంచింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ కేసులో ఇలాగే జరిగిందంటూ ఆ పోస్ట్‌లో ఉదహరించింది.
అయితే ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పాటు బాధితురాలితో ఫోన్లో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరగటంతో ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్‌ను తొలగించింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్‌జోన్ డీసీపీ డాక్టర్ శరణప్ప నిన్న మీడియాకు వెల్లడించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి జనవరి 10న రాత్రి 8.30 గంటల సమయంలో విధులు ముగించుకొని రాగిగుడ్డ బస్టాప్ నుంచి ఉత్తరహళ్లికి వెళ్లే బస్సు ఎక్కింది.
బస్సు బనశంకరి బస్టాండుకు చేరుకోగానే చాలా మంది దిగేశారు. దీంతో తనకివ్వాల్సిన చిల్లర ఇస్తే దిగిపోతానని చెప్పింది. ఈ సందర్భంలో కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన యువతి బస్సు ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ కూడా పట్టించుకోలేదు. తనకు లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని కండక్టర్ వేధించాడు. వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు యువకులు ముందుకొచ్చి యువతికి అండగా నిలబడటంతో కండక్టర్ వెనక్కి తగ్గి మిగతా చిల్లర ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ యువతి చేతులు తాకి అసభ్యంగా వ్యవహరించాడు.
బస్సు దిగాక సదరు యువతి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు కండక్టర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా బస్సులో యువతిపై వేధింపులకు పాల్పడలేదని డ్రైవర్, కండక్టర్ తెలిపారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు బీఎంటీసీ ఎండీ అందుబాటులో లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more