భారత జాతీయ పతాకాన్ని పోలిన కాలి పట్టాలను విక్రయిస్తూ భారత దేశ సౌర్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కించపరిచిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ను కేంద్ర సర్కారు మరోసారి హెచ్చరించింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ దీనిపై స్పందిస్తూ... అమెజాన్ భారతదేశ చిహ్నాలు, గౌరవ సూచికలతో అలక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. భారతీయుల మనోభావాల విషయంలో వివక్ష చూపితే అమెజాన్ తనంతట తానే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టు అవుతుందన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను తాను ఓ భారతీయ పౌరుడిగానే చేస్తున్నానని ఆయన అన్నారు. ఓ పౌరుడిగా తాను అమెజాన్ తీరు పట్ల ఎంతో కలత చెందానన్నారు.
తాజాగా జాతిపిత గాంధీ బొమ్మతో ఉన్న చెప్పులు సైట్లో అమ్మకానికి పెట్టింది. ఇది గమనించిన కొందరు ట్విట్టర్ యూజర్లు దీనిని బాగా హైలైట్ చేశారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్లను ట్యాగ్ చేసి ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. గాంధీ ఫ్లిప్ ఫ్లాప్స్ ధర 16.99 డాలర్లంటూ అమెజాన్ ఆ స్లిప్లర్స్ను అమ్మకానికి పెట్టింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ బహిష్కరణ?
ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అమేజాన్ సంస్థకు గట్టి హెచ్చరికలే చేసిన విషయం తెలిసిందే. కెనడాలో అమేజాన్ రిటైల్ విక్రయ విభాగం భారత పతాకాన్ని పోలిన కాలి పట్టాలను కొన్ని రోజుల క్రితం విక్రయానికి పెట్టగా... ఈ విషయాన్ని తెలుసుకున్న సుష్మాస్వరాజ్ తక్షణమే వాటి విక్రయాలను నిలిపివేసి భారత్ కు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే అమెజాన్ ప్రతినిధులకు వీసాలు కూడా ఇవ్వమని తేల్చిచెప్పారామె. దాంతో అమెజాన్ ఇండియా ప్రతినిధి క్షమాపణలు తెలిపారు.
Amazon must tender unconditional apology. They must withdraw all products insulting our national flag immediately. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) January 11, 2017
Amazon,better behave. Desist from being flippant about Indian symbols & icons. Indifference will be at your own peril.
— Shaktikanta Das (@DasShaktikanta) January 15, 2017
అయితే విమర్శలపై అమెజాన్ స్పందించకపోయినా.. సోషల్ మీడియాలో ఇది బయటపడిన తర్వాత ఆ స్లిప్పర్స్ను సైట్ నుంచి తొలగించింది. దీనిపై ట్విట్టర్ యూజర్లు తీవ్రంగా స్పందించారు. అమెజాన్ను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. డోర్మ్యాట్ల విషయంలోనే అమెజాన్ ప్రతినిధులకు ఇండియన్ వీసాలు నిలిపేస్తామని సుష్మా తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆ సంస్థ దిగి వచ్చింది. కానీ పదేపదే ఇలా భారతీయుల సెంటిమెంట్లను గౌరవించకుండా అమెజాన్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మనదేశంలో అమెజాన్ రెండో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఉన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more