దారి తప్పే విద్యార్థులను దారిలో పెట్టాల్సింది పోయి.. తానే విద్యార్థులను దారి తప్పించే వ్యవహారానికి తెరలేపింది. చదువుకోవాల్సిన వయసులో, విద్యార్థుల మెదళ్లలో సెక్స్ ఆలోచనలను రేకెత్తించి, చదువు చుట్టూ తిరగాల్సిన వాళ్ల ఆలోచనలను సెక్స్ చుట్టూ భ్రమించేలా తయారు చేసింది. సలహా కోసం సంప్రదిస్తే.. ఏకంగా ప్రేమలోకి దింపి, ఆపై సెక్స్ కార్యకలాపాలకే తెరలేపింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఆ టీచర్, విశృలంకత్వానికి కేరాఫ్ గా మారి ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కబెట్టుకుంటోంది.
అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న హేల్టన్ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా పనిచేసే అలెగ్జాండ్రియా వెరా (25) అనే 2015 లో 13 ఏళ్ల తన స్టూడెంట్ పై కన్నేసింది. ప్రేమ అనే విరహ వేదనతో ఆ అబ్బాయికి కూడా తన న్యూడ్ ఫోటోలను పంపించి సెక్సువల్ గా రెచ్చగొట్టింది. అలా చాటింగ్ చేస్తూ.. మెల్లగా తన వశం చేసుకుంది. రోజూ తన కార్లోనే స్కూల్‌కు తీసుకెళ్లి, సాయంత్రం వచ్చేటప్పుడు దింపేది. ఈ క్రమంలో వారి మధ్య బంధం మరింత పెరిగి అది కాస్తా శృంగార కార్యకలాపాలకు దారితీసింది.
తన తల్లిదండ్రులకు స్నేహితురాలిగా పరిచయం చేసిన ఆ అబ్బాయి... కుటుంబ కార్యక్రమాలకు కూడా పిలిచేవాడు. వారి కుటుంబంతో కూడా వెరా సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ యేడాది జనవరిలో ఆమె గర్భవతి అయింది. ఈ విషయాన్ని ఆ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పగా.. మొదట వారు ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి కూడా ఒప్పుకోవడంతో వెరాకు అబార్షన్ చేయించాలని నిర్ణయించారు. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా బాలుడికి, వెరాకు మధ్య ఉన్న సంబంధాన్ని డాక్టర్లు గుర్తించారు. మైనర్‌తో శృంగార కార్యకలాపాలు జరపడం నేరం కాబట్టి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చి... వెరాను ఏప్రిల్‌లో స్కూల్ నుంచి యాజమాన్యం డిస్మిస్ తీసేసింది. ఆమెపై ఆల్డినే ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసింది. మంగళవారం విచారణకు వచ్చిన ఈ కేసులో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. తనకు క్షమాభిక్ష విధించాలని న్యాయమూర్తిని కోరింది.
అయితే వయసు తేడా మరిచిపోయి, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన లిండాపై లైంగిక వేధింపుల కింద ఆరోపణలను సమర్థించిన కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయతే పెరోల్ కింద 5 ఏళ్లపాటు బయట తిరిగే అవకాశం కల్పించింది కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more