తమిళనాట రాజకీయాల్లో మరోక కలకలం రేగింది. తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటం పై నటుడు ప్రవేశంపై తమిళనాడులో వివాదం రగిలింది. జల్లికట్టుపై రజనీ కీలక కామెంట్లు చేసిన వేళ ఆయన పాలిటిక్స్ లోకి రావాలంటూ అభిమానులు పిలుపునివ్వటం, రజనీ వస్తే అడ్డుకుని తీరతామని నటుడు, సమతువ మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు(అన్నాడీఎంకే భాగస్వామి) శరత్ కుమార్ హెచ్చరించడం పెను దుమారాన్ని రేపుతోంది.
‘‘పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు' అని రజినీ వ్యాఖ్యానించారు. పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారని.. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
దీంతో రాష్ట్ర పరిస్థితులను పేర్కొంటూ రజినీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు రాజకీయ ప్రవేశంపై రజినీ ఆసక్తి చూపిస్తున్నారా? అంటూ తమ విశ్లేషణలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో వెంటనే తెర మీదకు వచ్చిన శరత్ కుమార్ రజనీకి తాను ఎదురు వెళ్తానంటూ కామెంట్లు చేశాడు. శనివారం తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... అసాధారణ పరిస్థితి అంటూ రజనీ మాట్లాడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమంటూ మండిపడ్డాడు.
"రజనీకి తమిళనాడు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి తెలియవు. సూపర్ స్టార్ గా, నటుడిగా నాకు రజనీకాంత్ పై గౌరవం ఉంది. అయితే, రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం కుదరదు. ఎందరో మహా నేతలు తమిళనాడు గడ్డపై జన్మించారు. వారం రోజులు తమిళనాడులో, మరో వారం కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు" అని శరత్ కుమార్ నిప్పులు చెరిగారు. తమిళ సంప్రదాయాలపై ఆయనకు అవగాహన లేదని, ఈ విషయం ఎంతో మందికి తెలుసునని అన్నాడు. దీంతో రజనీకాంత్ అభిమాన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగాయి. శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ, రోడ్లపై ధర్నాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ విషయంలో ఇప్పటిదాకా రజనీ మౌనంగానే ఉన్నాడు.
అయితే తీవ్ర నిరసనలు పెల్లుబిక్కటం మూలంగానే ఏమో శరత్ కుమార్ వెంటనే మాట మార్చేశాడు. రజనీకాంత్ గురించి తనంతట తాను మాట్లాడలేదని తెలిపాడు. తనవద్దకు వచ్చిన విలేకరులు తనను ఆ విషయంపై ప్రశ్నించడంతోనే స్పందించానని పేర్కొన్నారు. రజనీకాంత్ తనకు స్నేహితుడేనని చెప్పిన ఆయన.. ఒకవేళ రజనీ పార్టీ పెడితే మాత్రం ఆయనను ప్రత్యర్థిగా భావిస్తానని అన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించే వారు జన్మతః తమిళులే అవ్వాలన్నది తన ఉద్దేశమని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more