ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీకి పెద్ద షాక్ తగిలింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారయణరెడ్డి పెద్ద ఎత్తున్న అప్పులు చేయటంతో బ్యాంకు అధికారులు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.443.27 కోట్ల అప్పులున్నాయన్న పేర్కొన్న అధికారులు జప్తు చేసేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆయన అధికార తెలుగుదేశం పార్టీలోకి మారిపోయారు.
వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, పవర్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు హామీదారుగా ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ నుంచి ఈ మూడు కంపెనీలు మొత్తం రూ.443.27 కోట్ల రుణం తీసుకున్నాయి. అయితే, వీటిని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో రుణాలకు హామీదారుగా ఉన్న నారాయణరెడ్డికి సంబంధించిన ఆస్తులతోపాటు కంపెనీల పేరిట ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు సదరు బ్యాంకులు ప్రకటించాయి.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని కొన్ని స్థిరాస్తులతోపాటు కొన్ని భూములను కూడా స్వాధీనం చేసుకున్నట్టు బ్యాంకులు పేర్కొన్నాయి. కాగా, రుణం చెల్లింపునకు ఇచ్చే హెచ్చరిక నోటీలు తనకు ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా బ్యాంకుల నుంచి అందలేదని ఎమ్మెల్సీ తెలపటం విశేషం. కాగా, గతంలో ఓ బిల్డర్‌తో కుమ్మక్కై అక్రమంగా ఓ స్థలం ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంటూ ఆయనపై చీటింగ్ కేసు కూడా నమోదైంది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more