జనసేనాని పవన్ తో పోలవరం బాధిత రైతుల భేటి pawan kalyan met polavaram dumping yard farmers

Pawan kalyan met polavaram dumping yard farmers

Pawan Kalyan, Janasena, farmers, Polavaram, uddandaraya palem, lingaya palem, mulalanka farmers, dumping yard

The actor-politician, Jana Sena party chief, power star Pawan Kalyan to meet farmers who are losing lands due to Polavaram's dumping yard.

క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను తెలుసుకుంటా: జనసేనాని పవన్

Posted: 01/18/2017 03:47 PM IST
Pawan kalyan met polavaram dumping yard farmers

జనసేన పార్టీ నిర్మాణంలో అచితూచి అడుగులేస్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. మరో రెండేళ్లలో రానున్న ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తును ప్రారంభించాలని రైతులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరిలా తాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని తేల్చిచెప్పారు. ప్రజారాజ్యం  అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని.. ఈ తరుణంలో తాను నిదానంగా అడుగులు వేస్తానని అన్నారు. టీడీపీ, వైసీపీ రెండునూ రెండో జనరేషన్ పార్టీలని.. వాటితో పాటు పోటీ పడి తాను తొందరపాటు చర్యలకు పూనుకోనని అన్నారు9. అలాంటి అవివేక చర్యలకు తాను దూరమని, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే తాను అలోచిస్తానని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరిగిపోవాలన్న పగటి కలలను తాను కనడం లేదని పవన్ చెప్పారు.

అంతకు ముందు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మూలలంక రైతుల సమస్యలపై స్పందించిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్థానికంగా డంపింగ్ యార్డు కోసం పచ్చని పోలాలను ప్రభుత్వం సేకరించడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదని అన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణంలో ప్రభుత్వానికున్న ఇబ్బందులేంటో తనకు తెలియదని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే మూలలంకలోని ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులు తన దృష్టికి సమస్యను తీసుకువచ్చిన తీసుకువచ్చిన తరుణంలో తాను సమస్య తీవ్రతను తెలుసుకునేందుకు త్వరలోనే కేత్రస్థాయిలో పర్యటించి వివరాలను తెలసుకుంటానని పవన్ హామి ఇచ్చారు.

రైతులకు ఎట్టి పరిస్థితులలో అన్యాయం జరగడానికి వీలు లేదని, అయితే ఇలా ప్రభుత్వాలు భూ సేకరణలను జరపడం వల్ల ఆయా ప్రాంతాల్లలో కులాల వారీగా రైతులు నష్టాల పాలవుతారని, దీంతో సమసమాజానికి విఘాతం కల్పించే కుల పోరాటాలు కూడా తెరపైకి వస్తాయని పవన్ అభిప్రాయపడ్డారు. భూ సేకరణ అంశానికి సంబంధించిన తమ పార్టీ కూడా ఒక విదానాన్ని తీసుకువచ్చి .. దానిని ప్రభుత్వాలు అవలంభించేలా చర్యలు తీసుకునేలా చేస్తున్నామన్నారు. ప్రభుత్వాలతో పాటు అధికారులు కూడా ఈ సున్నితమైన సమస్యలను అద్యయనం చేసి.. ఎలాంటి తారతమ్యాలు లేకుండా సేకరణ చేపట్టాలని సూచించారు.

అంతకు ముందు, తమ ప్రాంతంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తాము మూడు పంటలు పండించే భూములను వదిలి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు పవన్ కల్యాన్ వద్ద ఏకరువు పెట్టారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలవరం మండలంలోని మూలలంక గ్రామస్థులు పవన్ కల్యాణ్ కు తెలిపారు. కోర్టు తీర్పులను వివరించినా అధికారులు ఆగడం లేదని, మూడు పంటలు పండే తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, డంపింగ్ యార్డ్ కోసం దగ్గర్లోని ఓ గ్రామానికి చెందిన బీడు భూములను చూపించినా అధికారులు అటు వైపు చూడడం లేదని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles