తమిళనాట యువకులు చేస్తున్న పోరాటం ఫలించింది. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తమిళుల డిమాండ్లు చూసిన కేంద్ర ప్రభుత్వం...తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ను స్వల్ప మార్పులు చేసి అమోదించింది. ఇక ఆర్డినెన్స్ తీసుకువచ్చే నేపథ్యంలో తమిళనాడు ఆర్డినెన్సును న్యాయశాఖకు పంపింది. ఆ తరువాత కేంద్ర మంత్రివర్గం దీనికి అమోదం తెలిపింది.
ఇక ఆర్డినెన్సుపై రాజముద్ర కోసం దానిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు కేంద్రం పంపింది. రాష్ట్రపతి ఆమోదించగానే జల్లికట్టు ఆర్డినెన్స్ ఉత్తర్వులు వెలువడుతుంది. దీనిపట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాగా గత నాలుగు రోజులుగా జల్లికట్టు కోసం నిద్రాహారాలు మాని మెరినా బీచ్ కేంద్రంగా ఉద్యమిస్తున్న తమిళుల శిభిరంలో అర్డినెన్స్ వార్త సంబరాలను నింపింది. శిబిరం వద్ద తమిళులు స్వీట్లు పంచుకున్నారు.
జల్లికట్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం నిషేధాన్ని విధించిన నేపథ్యంలో గత మూడేళ్లుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ సారి మాత్రం తమిళనాడు యువకులు పోరాటం ప్రారంభించారు. తమ సంస్కృతీ సంప్రదాయాలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తమిళనాడులోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. రాజకీయ, సినీ, కవులు, మేధావులు అన్న వత్యాసం లేకుండా ఉద్యమానికి ఊపిరినిచ్చారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు బదులు మెరినా బీచ్ కేంద్రంగా ఒక్కచోట పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని సూచించారు. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న నిరసనలకు కేంద్రం తలొగ్గింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more