ఓవైపు మాకోద్దు అంటూ తీవ్ర నిరసనలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ, మరోవైపు అగ్రరాజ్యంలో డొనాల్డ్ ట్రంప్ శకం మొదలైంది. అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతానని రెండు బైబిళ్లపై ప్రమాణం చేసిన ట్రంప్ తొలి ప్రసంగంతోనే అమెరికన్లను ఆకట్టుకున్నాడు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఒబామా దంపతులుసహా, జార్జిబుష్, బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ తదితరులు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ రాబన్ సన్ ట్రంప్ తో ప్రమాణం చేయించాడు. ఇక కార్యక్రమం పూర్తయిన తర్వాత అధ్యక్షుడిగా జాతినుద్దేశించి సుమారు 16 నిమిషాలపాటు ట్రంప్ ప్రసంగించాడు. వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని మళ్లీ మీకే(ప్రజలకు) బదిలీ చేస్తున్నానని పేర్కొన్నారు.
దేశమే అమెరిక్ల తొలి ప్రాధాన్యం కావాలని అన్నారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని, అమెరికన్ల చేతుల మీదుగా దేశాన్ని పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చాడు.‘‘అందరం కలిసి దేశాన్ని మరోసారి బలోపేతం చేద్దాం. అమెరికా అమెరికన్లదేనని, అమెరికా గమ్యాన్ని అందరం కలిసి నిర్ణయిద్దాం’’ అని 8 లక్షల మంది సమక్షంలో పేర్కొన్నాడు. ప్రజలే పాలకులైన రోజుగా జనవరి 20 చరిత్రలో నిలిచిపోతుందని భావోద్వేగంగా ప్రసంగించాడు. ఈ విజయం అమెరికన్లదేనని స్పష్టం చేశాడు.
నేటి నుంచి ఒకటే దేశం, ఒకటే హృదయమని, ప్రతి నిర్ణయాన్ని అమెరికా కుటుంబాలు, కార్మికులకు లబ్ధి చేకూర్చేలా తీసుకుంటామని స్పష్టం చేశాడు. శరీర రంగు ఏదైనా అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోందన్నారు. అందరం కలిసి అమెరికాను మారుద్దామని ట్రంప్ పిలుపునిచ్చాడు. తన పాలనకు అమెరికా ఫస్ట్ అనేదే కీలక మంత్రమని పేర్కొన్న అధ్యక్షుడు ట్రంప్ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి స్థానం లేదన్నాడు. భూమిపై నుంచి దానిని సమూలంగా నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ బూనాడు.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం ట్రంప్ తొలి సంతకం కూడా చేసేశాడు. ఇంకా వైట్ హౌస్ లో అడుగు పెట్టక ముందే మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హెల్త్‌కేర్ ప్రోగ్రాంను రద్దు ఆదేశాలపై సంతకం చేసేశాడు. ఎఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ-ఒబామా కేర్) పేరిట హెల్త్ కేర్ మరియు ఇన్సూరెన్స్ చట్టాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దానిని రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్ ప్రకటించాడు కూడా. అన్న మాట ప్రకారం ఇలా ప్రమాణం చేయగానే అలా సంతకం చేసేశాడు. అయితే దాని స్థానంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను వెల్లడించకుండానే చట్టాన్ని రద్దు చేయటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ట్రంప్ ప్రమాణ సమయంలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తుండగా, సోషల్ మీడియాలో కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ట్రంప్ కి అభినందనలు తెలిపారు. భారత దేశ ప్రధాని మోదీ కూడా ట్రంప్ కు విషెస్ చెబుతూ ట్వీటాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more