పులి మీద పడితే ఏం చేస్తారు ఎవరైనా? భయంతో వణికి చస్తారు కదా. అది వేటకు దిగిందంటే దాని కంటబడిన దానికి భూమిమీద నూకలు చెల్లినట్టే. మరి అదే పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం... వేటాడేస్తది! అయితే ఇక్కడో చిన్న జీవి మాత్రం పులినే పేకాట ఆడేసుకుంది. చిక్కదు.. దొరకదు... అన్న రీతిలో ముప్పుతిప్పలు పెట్టేసింది. వెంటాడి, వేటాడి అలిసిపోయిన పులి 'ఈ పూటకి ఇక పస్తే' అని భావించి వేట నుంచి విరమించుకుంది.
ఇంతకీ ఘటన ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్ లైఫ్ పార్క్ లో చోటుచేసుకుంది. నీటి కొలనులో ఓ బాతు తన పని తాను చేసుకుంటోంది. దాహం తీర్చుకునేందుకు ఆ నీటి కొలనును సమీపించిన పులి, బాతును చూసింది. అంతే, వెంటనే వేటాడి తినెయ్యాలని భావించింది. నీటిలో స్వేచ్ఛగా ఈదే బాతును తినాలనుకోవడం ఆ పులికి అత్యాశే అయింది. దీంతో చాలా సేపు దాని వెంటపడ్డ పులి ఇక దానిని పట్టుకోవడం తన వల్ల కాదని భావించి తోకముడిచింది.
ఈ సన్నివేశాన్ని ఓ టూరిస్ట్ తన కెమెరాలో బంధించి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. తన కాంపౌండ్ లోకి వచ్చిన పులిరాజును ఉరికించి ఉరికించి ఆడుకున్న వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఇదంతా చూసిన వారు సైజు తక్కువ కదా అంచనా వేస్తే ఇలాగే ఉంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద దారం అయిన చిన్న సూదికి లోకువే కదా!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more