అవును... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు పార్టీకి ఊహించని షాకిచ్చింది. సెమీఫైనల్స్ గా భావించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉండాలని ప్రియాంక వాద్రా డిసైడ్ అయ్యింది. దీంతో పార్టీ పునర్వైభవం కోసమే కాదు, పునాదులను లేపేందుకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హస్తం పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఓవైపు ఎస్పీతో పొత్తుపై సంగ్ధిగ్ధం కొనసాగుతున్న దశలో ఆమె తీసుకున్న నిర్ణయంతో పార్టీ షాక్ కి గురయ్యింది. రాహుల్ పరపతి పనిచేయకపోవటంతో ఇందిరమ్మ పోలికలు ఉన్న ప్రియాంకను దించటం ద్వారా లబ్ధిపొందాలని కాంగ్రెస్ భావించింది. అయితే ప్రచారంలో పాల్గేందుకు ప్రియాంక ఆసక్తి చూపడం లేదు. ఈ దఫా ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
2012 ఎన్నికల్లో అమేథీ, రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రియాంక విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం పది నియోజకవర్గాలకు గాను కేవలం రెండింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదేళ్లు గడిచినా యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మారకపోవడంతోనే ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు 2012 ఎన్నికల్లో కేవలం 28 సీట్లు గెలిచిన హస్తం పార్టీకి వంద సీట్లు కోరటం అసంబద్ధమైన డిమాండ్ అని సమాజ్ వాదీ పార్టీ భావిసత్ంోది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధికార ప్రతినిధులు రాహుల్, అఖిలేష్ తో పదే పదే చర్చలు జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more