ఓ వీడియోతో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ నైట్ క్లబ్బులో ముషారఫ్ స్టెప్పులేస్తున్న వీడియో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. పక్కనే గుర్తు తెలియని ఓ మహిళ(గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నారు) ఉండగా, 'యే జవానీ హై దీవానీ'లోని ఢిల్లీ వాలీ గర్ల్ ఫ్రెండ్ పాటకు మహిళతో కలసి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్ పేరును 'ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్' నుంచి గత ఏడాది మార్చ్ లో ప్రభుత్వం తొలగించింది. దీంతో, చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం వీడియో బయటపడటంతో ఫిట్ గా ఉన్నాడు కాబట్టి తిరిగి వచ్చి కేసులు ఎదుర్కోవాలన్న డిమాండ్ లేవనెత్తుతున్నారు.
పాక్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఓ టెలివిజన్ టాక్ షో వ్యాఖ్యాత అయిన హమిద్ మిర్ ఈ డ్యాన్స్ వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. మిర్ గతేడాది కూడా ముషార్రఫ్ కి చెందిన వీడియోను అప్ లోడ్ చేశాడు. అందులో తన భార్య సెహ్ బా తో కలసి ముషారఫ్ స్టెప్పులేశాడు. బెనజీర్ భుట్టో, నవాబ్ అక్బర్ బుగ్తి, ఘజీ అబ్దుల్ రషీద్ హత్య కేసుల్లోనే కాదు, జడ్జిలను అరెస్ట్ చేయటం, 2007 నవంబర్ లో పాక్ లో అత్యవసర పరిస్థితి విధించటం వంటి తీవ్రఆరోపణలు ముషార్రఫ్ పై ఉన్నాయి.
Do you know who is this man dancing in a night club and where is his pain these days? pic.twitter.com/9R5xVqLTHA
— Hamid Mir (@HamidMirGEO) January 21, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more