హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం పై కారణాలు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. తొలుత మావోయిస్టుల దాడి, ఆపై ఉగ్రవాదుల చర్యగా అనుమానించిన అధికారులు ఎన్ఐఏ తో కూడిన విచారణ జరిపించిన విషయం తెలసిందే. ఇక ఇప్పుడు అసలు విషయం తేల్చినట్లు చెప్పుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక జగదల్పూర్ నుంచి భువనేశ్వర్‌వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి 39 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. సడన్ బ్రేక్ వేయటమే ఘోర ప్రమాదానికి కారణమని సీనియర్ రైల్వే అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రధాన మార్గంలో రైలు వెళ్తున్నప్పుడు లోకోపైలట్ సడన్‌గా బ్రేకు వేయడం ముమ్మాటికీ తప్పేనని ట్రైన్స్ పాసింగ్ ఆపరేషన్ విభాగంలో ముఖ్య రవాణా అధికారిగా పనిచేసి రిటైరైన అధికారి ఒకరు తెలిపారు. మెయిన్ లైన్లో రైళ్లు గంటలకు 70-80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయని, అలాంటి సమయంలో సడన్ బ్రేక్ వేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
కూనేరు క్రాసింగ్ పాయింట్ వద్ద రైలు వెళ్లే పట్టా అడుగు మేర విరిగిపోయింది. ఇది గమనించని డ్రైవర్ రైలును పోనిచ్చాడు. రైలులోని సగం బోగీలు విరిగిపోయిన పట్టా నుంచి సురక్షితంగా వెళ్లిపోయాయి. అయితే ఆ తర్వాత కాసేపటికే పెద్ద శబ్దం రావడంతో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక బోగీలు పట్టాలు తప్పి ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయి. పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. డ్రైవర్ కనుక సడన్ బ్రేక్ వేయకుంటే ముందు బోగీల్లానే వెనక బోగీలు కూడా దాటేసి సురక్షితంగా దాటి ఉండేవని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ పట్టాలు తప్పినా అదేవేగంతో కొంతదూరం వెళ్లి ఆగిపోయి ఉండేవంటున్నారు. దీనివల్ల ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గేదని అంటున్నారు. డ్రైవర్ భయంతోనే ఈ ప్రమాదం జరిగిందని, సడన్ బ్రేకే కొంప ముంచిందని చెబుతున్నారు. మెయిన్‌లైన్‌లో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేయకూడదనే విషయం లోకో పైలట్ కు తెలీకపోవటం వల్లే ఇంత ఘోరం జరిగిందని వారంటున్నారు. అయితే అదే ట్రాక్ పై అంతకు ముందు ఓ గూడ్స్ ట్రెయిన్ వెళ్లటం గురించి మాత్రం వారి దగ్గరి నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more