ఆర్కే బీచ్ నిరసన... అనుమతి లేదంటూనే ఈ కండిషన్లు ఏంటి? | Conditions Apply for RK Beach silent Protest.

Conditions for rk beach protest for apdemandsspecialstatus

RK Beach silent Protest, APDemandsSpecialStatus, Tollywood tweets special status, RK Beach Protest, Janasena YSRCP silent Protest, Vizag RK beach protest

AP Demands Special Status protest at RK beach on 26th January. Conditions Apply for silent Protest. Tollywood support to that.

ఆంధ్రుల నిరసన గళం... కండిషన్లు అప్లై

Posted: 01/24/2017 09:21 AM IST
Conditions for rk beach protest for apdemandsspecialstatus

త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు కోసం ప‌ట్టుస‌డ‌ల‌కుండా యువ‌త చేసిన నిరస‌న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు న‌డుంబిగించింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని రామ‌కృష్ణ బీచ్ వేదిక‌గా ఈనెల 26 నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. హోదా కోసం పోరును ముమ్మ‌రం చేద్దామంటూ సామాజిక మాధ్య‌మాల ద్వారా పోస్టింగులు చేస్తున్నారు. రిప‌బ్లిక్ డే నాడు సాయంత్రం పార్టీల‌కు అతీతంగా కిర్లంపూడి లే అవుట్ ఎదురుగా బీచ్‌రోడ్డులో నిర్వ‌హించే శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు.

యువ‌త పిలుపున‌కు ప్రతిపక్ష నేత జగన్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే యువ‌త చేప‌ట్ట‌నున్న నిర‌స‌న కార్య‌క్ర‌మం అనుమ‌తి కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ యోగానంద్ తెలిపారు. అదే సమయంలో దీక్షలో పాల్గొనదలిచిన వారు కొన్ని కండిషన్లు పాటించాలంటూ సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎలాంటి రాజకీయ జెండాను పట్టుకొని రాకూడదు. రాజకీయ పార్టీలకు ఈ దీక్షకు ఎలాంటి సంబంధం లేదు. దీక్షకు సంబంధించిన బ్యానర్లు.. స్పెషల్ స్టేటస్ కు సంబంధించిన ప్లకార్డులు తీసుకురావొచ్చు. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లేలా ప్రవర్తించకూడదు. ప్రతిఒక్కరూ శాంతంతో వ్యవహరించాలన్న రూల్స్ ను సెట్ చేశారు. మరోవైపు ఏపీ సర్కారు.. ఈ నిరసన దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మొహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


సెలబ్రిటీల స్పందన ఇది...

- లోక్ సత్తా పార్టీః ఏపీ యువత ఒక్కతాటిపైకి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలి. ఈ సందేశాన్ని మీరు విస్తృతం చేయండి మిత్రులారా.

- రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ పోరాటంపై నాకు నమ్మకం ఉంది. ప్రజల ఆకాంక్షలు ఫలించే కోణంలో ఆయన ఇచ్చిన పిలుపునకు నా పూర్తి మద్దతు.

- వరుణ్ తేజ్: రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ అంశానికైనా నా మద్దతు ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతివ్వండి.

- శర్వానంద్ః నాయకుడంటే నమ్మించేవాడు కాదు. నడిపించే వాడు. పవన్ కళ్యాణ్ పై ఆ నమ్మకం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. నా రాష్ట్రం...నా హక్కు. ఇదే ఆంధ్రులకు పిలుపు.

- సాయి ధరంతేజ్ః మన రాష్ట్రానికి హామీ ఇచ్చిన దాన్ని సాధించుకునేందుకు మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా గళం విప్పుదాం.

- నిఖిల్ః ప్రజాస్వామ్యంలో మన హక్కుల కోసం శాంతియుతంగా పోరాడం చేయడం మంచి నిర్ణయం. వైజాగ్ ఆర్కే బీచ్లో మన గళం బిగ్గరగా వినిపించుదాం.

- తమ్మారెడ్డి భరద్వాజః తెలుగు యువతకు ఏదైనా సాధించే శక్తి ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ను నెరవేర్చుకునేందుకు ముందుకు రావాలి. మనమంతా ఐక్యం అవుదాం. ఏపీ హక్కును సాధించుకుందాం.

- సందీప్ కిషన్ః బాధ్యతాయుతమైన పౌరుడిగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైజాగ్ ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమంలో నేను పాల్గొంటున్నారు. మీరంతా కూడా పాల్గొనండి.

- శివబాలజీః ఏపీకి ప్రత్యేక హోదా కోసం కదం తొక్కుదాం. పదం పాడుతూ హృదయాంతరాలు గర్జిస్తూ పదండి పోదాం ముందుకు.

- మెహర్ రమేశ్ః ఏపీ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా ఏపీ వాసుల హక్కు.

- జానీ మాస్టర్ః ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చాటేందుకు మనమంతా ఒకటవుదాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను మనస్పూర్తిగా మద్దతిస్తాను.

- తనీశ్ః మనమంతా ఏకం అవ్వాల్సిన సమయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.

- ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా సాధన దీక్షకు తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబు సైతం మద్దతు పలికాడు. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన సంపూర్ణేశ్ బాబు ప్రత్యేక హోదాకు మద్దతుగా తన ఫేస్ బుక్ కవర్ ఫొటోను మార్చేశాడు.

- ప్రత్యేక హోదా సాధన సమైఖ్య సమితి అధ్యక్షుడు మరియు నటుడు శివాజీ : వైజాగ్ #RKBEACH లో చేస్తున్న #ApDemandsSpecialStatus సైలెంట్ ప్రొటెస్ట్ కి నా సంపూర్ణ మద్దతు

- మంచు మనోజ్ : ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ సైలెంట్ ప్రొటెస్ట్ కి తన మద్దతు తెలుపుతూ తన గుంటూరోడు మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని పోస్టుపోన్ చేసుకున్నాడు. అయితే అదే రోజు తన అన్న విష్ణు లక్కున్నోడు చిత్రం విడుదల కాబోతుందని, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా దానిని వాయిదా వేయటం లేదంటూ చెబుతూ... #APdemandsSepcialStatus కి సపోర్ట్ తెలిపాడు .

సంయమనం అవసరం... చంద్రబాబు

ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ద్వారా నాకు ఒక చారిత్రక బాధ్యత అప్పగించారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ను నిలిపేందుకు నేను పగలనకా రాత్రనకా శ్రమిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతత ఓపిక సంయమనంతో వ్యవహరించే నాయకత్వం ఉన్న అనుభవశాలి నాయకుడి సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం వైపు మన రాష్ట్రం ముందుకు సాగుతోంది. కేంద్రం నుంచి మనకు కావల్సింది రాబట్టుకుంటున్నాం. ఇలాంటి సమయంలో వారితో వైరం మనకు మంచింది కాదు. నేను అభివృద్ధి పథంలో దూసుకుపోయే రాష్ట్రంగా ఏపీని అగ్రపథంలో నిలుపుతానని మీకు భరోసా ఇస్తున్నాను. ప్రజలకు నేను ఈ విషయాలను తెలియజేస్తున్నానంటూ నిన్న ప్రెస్ మీట్ లో తెలియజేశాడు కూడా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RK Beach  Silent Protest  Andhra Pradesh  Special Status  

Other Articles