తల్లిదండ్రులు, గురువు, దైవం అందర్నీ గౌరవించాలని, వారందరి అశీస్సులను పొందాలని చెబుతున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోయి.. ఏకంగా తన విద్యాబోధన చేసే మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపిన విద్యార్ధి వైనంమిది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విద్యార్ధిది తప్పులేదని తేల్చినా.. అతడ్ని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు పంపక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ మహిళా లెక్చరర్ మొబైల్ ఫోన్ కు అశ్లీల మెసేజ్ లు వచ్చాయి.
దీనిపై అమె ఈ నెల 13న స్థానిక మల్లేశ్వరం పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు మొబైల్ నెంబర్ అధారంగా ముందుకుసాగారు. మొబైల్ పోన్ అదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థిదని కనుగొన్నారు. అతడ్ని విచారించగా, తాను ఎవరికీ అశ్లీల మెసేజ్ లు పంపలేదని చెప్పాడు. అయితే మహేంద్ర అనే కాలేజ్ అటెండర్.. తన ఫేస్ బుక్ అప్ డేట్ చూస్తానని తన మొబైల్ తీసుకున్నాడని తెలిపాడు.
కాగా అటెండర్ మనస్సులోని దుర్భుద్దిని తెలుసుకోలేకపోయిన విద్యార్థి తన మొబైల్ ఇచ్చాడు కానీ అతడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిసి.. కూడా పొలీసులు అతడ్ని కూడా అదుపులోకి తీసుకన్న పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరుపగా తాను అశ్లీల మెసేజ్ ను పంపినట్లు అంగీకరించాడు. అయితే విద్యార్థి తప్పు లేదని తెలుసుకున్న మల్లూశ్వరం పోలీసులు.. తన మొబైల్ నుంచి మెసేజ్ వెళ్లిన కారణంగా అతడ్ని కూడా అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more