వధువు మోడలో మరో మహిళ తాళి కట్టింది. అదేం విచిత్రం.. ఈ మధ్యకాలంలో ఈ పైపరిత్యాలు పెరిగిపోయాయి అంటూ నిట్టూర్చుతున్నారా..? కానీ ఇధి ఎంత మాత్రం స్వలింగ సంపర్కుల మధ్య పెళ్లి కాదు. కానీ వధువు మెడలో తాళి మాత్రం కట్టింది మరో మహిలే. ఏంటీ విచిత్రం..? ఎందుకలా..? అంటూ వివరాలు చెప్పమంటున్నారు కదూ.. తమిళనాడులోని కన్యాకుమారీ జిల్లాలో ఇలా వరుడు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. అదెలా? అంటారా.. భారీ సంఖ్యలో బంధుమిత్రులు రాగా, మత పెద్దల సమక్షంలో అట్టహాసంగా వివాహం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పద్మనాభపురానికి చెందిన సోఫియాకు, పేచ్చిపారైకి చెందిన అజారుద్దీన్‌కు కొద్ది రోజులకు ముందు ముస్లిం సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది. అజారుద్దీన్ సౌదీలో ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. క్రితం రోజు పద్మనాభపురంలోని ఓ కళ్యాణ మండపంలో వీరిరువురి పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. గురువారం అజారుద్దీన ఇండియాకు వచ్చేందుకు సౌదీ విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. ట్రాఫిక్ రద్దీ కారణంగా సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయాడు.
దీంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. పెళ్లి ముహూర్తానికి వరుడు అజారుద్దీన్ రాలేడని తెలుసుకున్న ఇరువైపు బంధువులు నిరాశ చెందలేదు. వరుడు లేకపోయినా పర్వాలేదు.. పెళ్లి జరిపి తీరుతామంటూ ప్రకటించారు. ఆ మేరకు వధువు సోఫియా మెడలో అజారుద్దీన్ చెల్లెలు సూత్రధారణ చేసింది. పెళ్లికి విచ్చేసినవారంతా వధువుకు ఆశీర్వచనాలు, కానుకలు అందజేశారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు అంగీకార పత్రాలపై సంతకాలు పెడితేనే సగం పెళ్లయినట్లని, కనుక సోఫియాకు జరిగింది పెళ్లిగానే పరిగణిస్తామని పెద్దలు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more