అమెరికా అధ్యక్షుడు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు తొలిసారిగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. డొనాల్డ్ నిర్ణయంతో న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రయంలో 12 మంది శరణార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరిని మాత్రమే అమెరికా అధికారులు విడిచిపెట్టారు. మిగతావారి తరపున కోరుతూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్ యూ) కోర్టును ఆశ్రయించింది.
అమెరికా పోలీసులు నిర్బంధించిన వారిని 14 నుంచి 24 గంటల్లో విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తాము విధించిన స్టే దేశమంతా వర్తిస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఉన్న శరణార్థులను వెనక్కు పంపొద్దని.. అంటే దీనర్థం వారిని అమెరికాలోకి అనుమతించమని కాదని... వీరిని గ్రే ఏరియా(శరణార్థి శిబిరం)లో ఉంచాలని సూచించింది. శరణార్థులను అనుమతించకూడదని డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఉత్తర్వు జారీచేయడంతో అమెరికా విమానాశ్రయాల్లో ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను, శరణార్థులను అడ్డుకున్నారు. అన్నిపత్రాలు ఉన్నప్పటికీ వారిని అనుమతించలేదు.
ఇక మరోవైపు అమెరికా అంతటా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది నిరసనలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూమి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వందలాది మంది గుమిగూడారు. 'మేమంతా ప్రవాసులమే', 'శరణార్థులను అనుమతించాలి, శరణార్థులను స్వాగతించాలి' అన్న నినాదాలతో వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు నెవార్క్ లిబర్టీ విమానాశ్రయం వద్ద కూడా వందలమంది నిరసనకారులు గుమిగూడి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనప్రదర్శన నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more