విద్యార్థులూ పరీక్షలలో పోటీ తత్వం పెంచుకోండీ: ప్రధాని PM modi guides students for exams

Modi in mann ki baat urges students to compete with themselves

narendra modi, mann ki baat, radio programme, narendra modi mann ki baat, mann ki baat radio programme, narendra modi radio programme, india news

Prime Minister Narendra Modi primarily focussed on students set to appear in the Class X and XII Boards and other competitive examinations across the country.

ITEMVIDEOS: విద్యార్థులూ పరీక్షలలో పోటీ తత్వం పెంచుకోండీ: ప్రధాని

Posted: 01/29/2017 12:12 PM IST
Modi in mann ki baat urges students to compete with themselves

విద్యార్థులంతా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. పరీక్షలు పండుగల్లాంటివి. పరీక్షలను విద్యార్థులను ఆనందంగా స్వీకరిస్తే.. ఎలాంటి ఒత్తిడి ఉండదు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో పండుగ వాతావరణాన్ని ఏర్పరచాలన్నారు. మనతో మనమే పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలో నకలు కొట్టొద్దని అన్నారు. అలా చేస్తే జీవితంలో ఎదగలేరని ప్రధాని విద్యార్థులకు సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో, కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో విద్యార్థలు చొరవతో ముందుకు వెళ్లాలని అన్నారు.

చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఇతరు వ్యక్తులతో పోల్చుకున్నప్పుడు మూడూ అంశాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. మొదటిది వాళ్లకంటే చురుకైన వ్యక్తులమనిపిస్తుందని, రెండోది వాళ్లతో సరిసమానంగా ఉన్నామనిపిస్తుందని, మూడోది వాళ్లకంటే తమను తక్కువగా ఊహించుకుంటామని అన్నారు. అయితే ఇతరులతో పోటీ పడి ఓడిపోతే బాధపడతామని, ఒకవేళ గెలిస్తే గర్వంతో విర్రవీగుతామని.. ఈ రెండూ మంచివి కావని మోదీ విద్యార్థులకు సూచించారు.
 
దీని వల్ల వ్యక్తిత్వం దెబ్బతింటుందని అన్నారు. అందుకే ‘మనం మనతోనే పోటీ పడాలని’ అన్నారు. గతంలో చేసిన పని కంటే మెరుగ్గా ఎలా చేయాలో ఆలోచించాలని ప్రధాని సూచించారు. జనవరి 30న (సోమవారం)  గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు మౌనం పాటించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని అన్నారు. కశ్మీర్‌లో మంచు చరియలు విరిగిపడి జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  mann ki baat  radio programme  students  exams  competition  

Other Articles