చేనేత జాతి సంపద.. హోదాపై అర్థరాత్రి ఎందుకు ప్రకటన చేశారు? | Pawan Kalyan questions to BJP Government.

Pawan kalyan press meet on handloom weavers and ap status

Pawan Kalyan, Janasena Chief, Pawan kalyan handloom Press Meet, Pawan kalyan Handloom Mascot, Pawan kalyan jagan, Pawan kalyan AP Special Status, Pawan kalyan BJP Government, Pawan kalyan Press Meet, Pawan kalyan Handloom Saytagraha

Pawan Kalyan Meet Handloom Weavers about Their Problems. Pawan Kalyan thanked by Handloom Weavers for offering to be their Mascot. I am Ready to Work with YS Jagan For Special Status.

ITEMVIDEOS:చేనేత కార్మికులకు అండగా ఉంటా-పవన్

Posted: 01/31/2017 06:19 PM IST
Pawan kalyan press meet on handloom weavers and ap status

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కార్మిక సంఘాలు కలిసి కృతజ్నతలు తెలియజేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ ప్రసగించాడు. చేనేత వృత్తి జీవనాధరంగా చేసుకుని బతుకున్న వారికి జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశాడు. అంతేకాదు మంగళగిరి చేనేత సత్యాగ్రహానికి ముఖ్య అతిథిగా వెళ్లేందుకు సమ్మతిని కూడా తెలియజేశాడు. వారికి అండగా, ఉంటానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపాడు. చేనేత జాతి సంపద, కళ. అలాంటి దానికి సరైన ప్రోత్సహాం లేకపోవటం బాధాకరమన్నాడు.

మిలాన్ లాంటి నగరంలో కశ్మీరీ వర్క్ ను డిజైనర్లు కొనుగోలు చేస్తారని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగల మనవారి నైపుణ్యం వారికి అవసరం ఉంటుందని భావిస్తున్నానని, అలా చేనేతను అంతర్జాతీయ బ్రాండ్ గా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉందని ఆయన తెలిపారు. చేనేతపై తనకు మక్కువ ఉన్నప్పటికీ, ఇంకా చాలా విషయాలు అధ్యయనం చేయాల్సి ఉందని, నిపుణుల సలహాలు తీసుకుని జనసేన మేనిఫేస్టోలో చేనేత రంగానికి తాము ఏం చేయదలుచుకుంటున్నామో తెలియజేస్తామన్నాడు. పరిమిత అవగాహన ఉన్నందున తానిప్పుడు ఏం మాట్లాడలేనన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవటం లేదు కాబట్టే తాను రంగంలోకి దిగానని, లోతుగా పరిశీలించి దీనిపై మరిన్ని వివరాలు మాట్లాడుతానని తెలిపాడు. ఇక పై తాను వారం లో ఒక రోజు చేనేత దుస్తులు ధరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

 

అర్థరాత్రే ప్యాకేజీ ఎందుకు?
ఇక ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మొండివాళ్లు రాజుకంటే బలవంతులన్న చందాన నేతల తీరు ఉందని ఆక్షేపించాడు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతే ప్రజలు కూడా తిరుగుబాటు ధోరణి వచ్చే ప్రమాదం ఉందని తెలిపాడు. నాయకుల లోపం మూలంగానే ఇలాంటి పరిస్థితి దాపురించిందని అన్నాడు. ఉత్తర, దక్షిణ అంటూ ప్రాంతీయ రాజకీయాలపై తాను వ్యాఖ్యలు చేయలేదని, పరిస్థితిని అంతదాకా తెచ్చుకోవద్దని మాత్రమే తాను సూచించానన్నాడు. అయినా మతపరమైన రాజకీయాలే వాళ్లు చేస్తున్నారంటూ చురకలు అంటించాడు.

ఎన్నికల కోసం రాష్ట్ర విభజన రాత్రి పూట చేశారంటే ఎన్నికల కోసమని ఓ అర్థముందని, అప్పుడు పొలిటికల్ గేమ్ లో భాగంగా బీజేపీ మద్ధతు కూడా తెలిపిందని, మరి అధికారంలో ఉండీ కూడా స్పెషల్ ప్యాకేజీ అర్థరాత్రి ఎందుకు ప్రకటించారంటూ ప్రశ్నించాడు. పరిమితులున్నాయంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా మొండిగా ముందుకు పోతే నష్టం వారికేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నాడు. ట్విట్టర్ వేదికగానే వ్యాఖ్యాలు చేస్తున్నాడని తనపై కొందరు కౌంటర్ వేస్తున్నారని, ఎంపీలు అయి ఉండి కూడా పార్లమెంట్ లో కూర్చుని కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు కదా అని సూటిగా ప్రశ్నించాడు.

పార్టీలన్నీ అమానుషమేనని, బీజేపీ కూడా గతంలో చాలా తప్పులు చేసిందని, అయినా కేవలం సర్దిదిద్దుకునే అవకాశం ఇద్దామనే తాను ఆరోజు మద్ధతునిచ్చానని తెలిపాడు. వామపక్షాల మద్దతు గురించి ప్రస్తావిస్తూ సీపీఐ, జగన్ కాదు, ప్రజా సమ్యసలపై పోరాటానికి ఎవరు తనతో కలిసి వచ్చినా ముందుకు సాగుతానని వెల్లడించాడు. అయితే ఉద్యమ పోరాటానికి నాయకత్వం వహించే పరిస్థితికి తాను చేరలేదన్న పవన్, అనుభవజ్నుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తానని తెలిపాడు. దాసరి అనారోగ్యంపై సమాచారం అందిందని, చూడటానికి వెళ్తున్నట్లు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Handloom  Press Meet  AP Special Status  

Other Articles