గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ మృతి.. బడ్జెట్ జరిగేనా? | Former Minister E Ahamed Dies After Cardiac Arrest.

Former union minister e ahamed passes away

Former Minister E Ahamed, MP E Ahamed Death, Ahamed Death, Budget Session 2017, Budget in Dilemma, E Ahamed Dies

Former Minister E Ahamed Dies After Suffering Cardiac Arrest.Budget Session in Dilemma.

గుండెపోటు ఎంపీ కన్నుమూత.. బడ్జెట్ పై సంగ్ధిగ్ధం?

Posted: 02/01/2017 08:56 AM IST
Former union minister e ahamed passes away

మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ కే అహ్మద్ నిన్న పార్లమెంట్ లో గుండె పోటుతో కింద పడిపోయిన విషయం తెలిసిందే. ఓవైపు రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతుండగానే 78 ఏళ్ల అహ్మద్ ను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది ఆయన్ను హుటాహుటినా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు కూడా. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

తెల్లవారుఝామున 2గంటల 15 నిమిషాలకు ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కేరళకు చెందిన అహ్మద్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు. కేరళ మల్లాప్పురం లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన విదేశీ వ్యవహారాలు(స్వతంత్ర్య) మంత్రిగా వ్యవహరించాడు.

E Ahamed Death

గుండెపోటు తర్వాత ఆయనను ఐసీయూలో తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో బంధువులను అనుమతించకపోవటంతో ఆస్పత్రి వద్ద కాసేపు హైడ్రామా జరిగింది. తనయుడు, కూతురు, అల్లుడు వైద్యులతో వివాదంకు దిగారు. చివరకు వారిని లోపలికి పంపించటంతో పరిస్థితి సర్దుమణిగింది. కాగా, ఈ సీనియర్ నేత మృతిపై సోనియా గాంధీ, రాహుల్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ఎంపీ మృతితో కేంద్ర బడ్జెట్ సంగ్ధిగ్ధంలో పడ్డట్లు అయ్యింది. పాత సంప్రదాయం ప్రకారం సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంటుంది. దీనిపై 10 గంటలకు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP E Ahamed  Died  Budget Session 2017  

Other Articles