బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున మోడీ సర్కార్ అనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కన బెట్టిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సిట్టింగ్ ఎంపీ చనిపోయినప్పటికీ బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టాయి. ఐదు పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు మరణానికే సభ సంతాపాన్ని వ్యక్తం చేసి గౌరవాన్ని ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించాయి. ఒకవైపు సహచరుడు మరణించి ఉండగా, సభను జరపడడం, బడ్జెట్‌ను ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని కాంగ్రెస్, జేడీయూ, ఆర్ఎల్డీ పార్టీలు మండిపడ్డాయి.
కేరళలోని మళప్పురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఎంపీ అహ్మద్ మరణవార్తను ప్రకటించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఖర్గే అరోపించారు. ఎంపీ అహ్మద్ మంగళవారం సభలోనే గుండెపోటుకు గురయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ఉభయసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నతరుణంలోనే ఈ ఘటన జరిగింది. పార్లమెంట్ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం 2:30కి కన్నుమూశారని కానీ బడ్జెట్ ను ఎలాగైనా ప్రవేశపెట్టాలన్న ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఆయన మరణవార్తను ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటించిందని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖార్గే అరోపించారు.సీనియర్ సభ్యుడి మరణానికి సంతాపంగా సభను వాయిదావేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ మరణం నేపథ్యంలో సభ జరపాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ సూట్‌కేసుతో రాష్ట్రపతిని కలవడాన్ని మాజీ ప్రధాని దేవేగౌడ తప్పుపట్టారు. ‘ఆర్థిక మంత్రి సూట్‌కేసు పట్టుకుని హడావిడిగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు. నిజానికి బడ్జెట్ ప్రభుత్వం సంకల్పిస్తే బడ్జెట్ వాయిదా పెద్ద కష్టమేమీకాదు. హడావిడి సృష్టించడం ద్వారా బడ్జెట్ వాయిదా వేయకూడదనే తన సంకల్పాన్ని ప్రభుత్వం బయటపెట్టకుంది’అని దేవేగౌడ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more